Snakes | వీళ్లేం మ‌నుషులు.. ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Snakes | వీళ్లేం మ‌నుషులు.. ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2025,4:00 pm

Snakes | రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రజల ప్రాచీన నమ్మకాలు, ఆచారాలు ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి.అక్కడి ప్రజలు ప్రతి ఏడాది గోగాజీ మహారాజు జయంతిని తేజ దశమి రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జరిగే గోగాజీ మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మేళాలో వేలాది మంది భక్తులు పాల్గొని అరుదైన సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. బ్రతికున్న పాములను చేతిలో పట్టుకుని నాట్యం చేస్తారు.

#image_title

తేజ దశమి సందర్భంగా ప్రత్యేక ఉత్సవం

తేజ దశమి రోజున గోగాజీ మేళా నిర్వహిస్తారు. ఈ రోజును స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గోగాజీ మహారాజు స్థానిక లోకదైవంగా పూజిస్తారు. ఆయన్ని నాగదేవతల రూపంగా కూడా కొందరు భావిస్తారు, అందుకే పామును ఈ ఉత్సవంలో లో చేతిలో పట్టుకుని డ్యాన్సులు చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, పాములను చేతిలో పట్టుకుని భక్తులు ఉత్సాహంగా నాట్యం చేస్తూ కనిపించారు.

ఇది సోషల్ మీడియా చూసి అందరూ ఆశ్చర్యాపోతున్నారు. ఈ ఆచారం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండటంతో, స్థానికులకైతే ఇది సాధారణమే. భయం లేకుండా పాములతో కలిసే భక్తులు నృత్యం చేస్తూ, గోగాజీ మహారాజుకు తమ భక్తిని చాటుకుంటారు. ఈ మేళాకు రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. బ్రతికున్న పాములతో డ్యాన్సులు చేయడం అనేది ఈ మేళాకి ప్రత్యేక ఆకర్షణ. ఆధ్యాత్మికత, సాహసం, సంప్రదాయాల కలయికతో ఈ వేడుక సాగుతుంది. పాములతో నాట్యం చేయడం అనేది చాలా మందికి భయంగా అనిపించొచ్చు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది