Sawai Madhopur | ప్రకృతి ఆగ్రహం.. వరదలతో 55 అడుగులు కుంగిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న అధిక వర్షపాతం కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావంతో సవాయి మాధోపూర్ జిల్లా జాదవత్ గ్రామం పరిధిలో తీవ్ర భూమి కుంగింపు చోటుచేసుకుంది.

#image_title
ఉధృతికి విపత్తు
బాధిత ప్రాంతంలో ఉన్న సర్వాల్ జలాశయం పొంగిపొర్లడంతో, ఆ వరద ఉధృతి భూమిని చీల్చేసింది. దీంతో రూ. 2 కిలోమీటర్ల పొడవులో, 100 అడుగుల వెడల్పుతో, 55 అడుగుల లోతులో ఒక భారీ బిలం (గొయ్యి) ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో చెట్లు, పంట పొలాలు, కొన్ని ఇళ్లు పూర్తిగా ఆ గుంతలోకి కూలిపోయాయి. గ్రామ ప్రజలు తమ ఇళ్లూ భూమిలోకి కూరుకుపోతాయన్న ఆందోళనతో భయబ్రాంతులకు లోనవుతున్నారు.
భూమి ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందని భావించి అధికారులు అప్రమత్తమయ్యారు.వర్షాల తీవ్రతతో ప్రాంతీయ రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సహాయ చర్యలకు వెళ్లే దళాలకు మార్గం లేకపోవడంతో రెస్క్యూ పనుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షించగా, మరిన్ని ఎమర్జెన్సీ బృందాలు సంఘటితంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
#WATCH | Rajasthan: A big portion of land caves in due to heavy rainfall in Sawai Madhopur. pic.twitter.com/fUzz8GTdht
— ANI (@ANI) August 24, 2025