Ram Charan : తారక్ మ్యాడ్ డ్రైవర్..! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
ప్రధానాంశాలు:
Ram Charan : తారక్ మ్యాడ్ డ్రైవర్..! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యాక్టింగ్, డ్యాన్స్, ఎనర్జీతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌పై తాజాగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ,చరణ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గ్లోబల్ హిట్ మూవీ RRRలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ స్థాయికి చేరిన ఈ జోడీ, టాలీవుడ్ పేరు అంతర్జాతీయంగా మారుమోగేలా చేసింది. స్క్రీన్‌పై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
Ram Charan : తారక్ మ్యాడ్ డ్రైవర్..! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
Ram Charan : సరదా కామెంట్స్..
ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా, “మీకు పవర్‌ఫుల్ కారు ఇచ్చి, మీరు ప్యాసింజర్ సీట్‌లో కూర్చోవాల్సి వస్తే.. ఎవరి డ్రైవింగ్‌పై పూర్తి నమ్మకం ఉంటుంది?” అని ప్రశ్నించారు. దీనికి చరణ్ ముందుగా నవ్వుతూ, “అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వను” అని సమాధానమిచ్చాడు. అయితే వెంటనే, “కానీ కొంతమందితో డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. అందులో తారక్ ఒకడు. తారక్ ఒక మ్యాడ్ డ్రైవర్. అతని డ్రైవింగ్ చాలా ఎనర్జీగా, ఇంటెన్స్‌గా ఉంటుంది. అతనితో రైడ్ చేస్తే భయంతో పాటు ఎంజాయ్‌మెంట్ కూడా ఉంటుంది” అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇప్పటివరకు ఎన్టీఆర్‌ను నటుడు, డాన్సర్, సింగర్‌గా మాత్రమే చూసిన అభిమానులు, ఇప్పుడు ఆయన డ్రైవింగ్ స్కిల్స్ గురించీ చర్చ మొదలుపెట్టారు. “తారక్‌లో ఇంకో టాలెంట్ బయటపడింది” అంటూ ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే కెరీర్ పరంగానూ ఈ ఇద్దరూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ లో నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలకూ మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యం ఉండడం విశేషం.