Pithapuram : సడెన్‌గా తన తల్లిని తీసుకొని పిఠాపురానికి వెళుతున్న రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?
ప్రధానాంశాలు:
Pithapuram : సడెన్‌గా తన తల్లిని తీసుకొని పిఠాపురానికి వెళుతున్న రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?
Pithapuram : పిఠాపురం ఊరి పేరు ఒకప్పుడు చాలా మందికి తెలిసేది కాదు.కాని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ నియోజక వర్గం నుండి బరిలోకి దిగాడో అప్పటి నుండి ఆ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఈ సారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు చాలా కష్టపడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కూడా చిరు వీడియోను షేర్ చేసి మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అల్లు అర్జున్ సైతం తన ట్విట్టర్ ద్వారా పవన్‌కి తన వంతు సపోర్ట్ అందించారు.
Pithapuram : తల్లితో పిఠాపురానికి..
అయితే మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనున్న వేళ.. చరణ్, సురేఖ పిఠాపురంలోని ఆలయానికి వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన తండ్రి పద్మవిభూషణ్ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లిన రామ్ చరణ్ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఇక ఈ రోజు రామ్ చరణ్.. తన తల్లి సురేఖతో కలిసి రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. మొక్కులు కూడా చెల్లించుకోనున్నారు.పనిలో పనిగా తన బాబాయ్ కి ప్రచారం కూడా జరిగిపోతుందనేది లోపల వినిపిస్తున్న టాక్. మరి ఆలయ దర్శనం అయ్యాక సురేఖ, రామ్ చరణ్ ఏమైనా పవన్ కు మద్దతుగా మాట్లాడుతారేమో అనేది ఆసక్తికరంగా గమనిస్తున్నారు.
ఇక ఈ విషయం బయటకు రావడంతో సురేఖ, రామ్ చరణ్ పిఠాపురం పర్యటన గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున బరిలోకి దిగిన పవన్ ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు గాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. తాను గెలిచిన తర్వాత అక్కడే ఉండి ప్రజా సమస్యలను తీర్చుతానని హామీ ఇస్తున్నారు. మరి ఇంత మంది పవన్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ ఆయనని గెలిపించే ప్రయత్నం చేస్తుండగా, రిజల్ట్ ఏం వస్తుందనేది జూన్ 4 తర్వాత అర్ధమవుతుంది.