YCP Leader : పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలా మారిపోయిన రామ్ గోపాల్ వర్మ..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 3, 2023, 8:00 pm

YCP Leader : రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరిని అడిగినా ఏం చెబుతారు. ఆయన పెద్ద జీనియస్ అంటారు. మరికొందరు మాత్రం ఆయనో పిచ్చోడు అంటారు. ఆయన దగ్గరికి వెళ్లి నువ్వు పిచ్చోడివి అన్నా కూడా ఆయన పట్టించుకోడు. ఎవరి అభిప్రాయం వారిది అంటాడు ఆర్జీవీ. అందుకే ఆర్జీవీని పెద్దగా ఎవ్వరూ గెలకరు. నిజానికి ఆయన గొప్ప దర్శకుడు. నా జీవితం.. నా ఇష్టం అంటూ తనకు నచ్చినట్టు బతికే ఆర్జీవీ ఒకప్పుడు గొప్ప డైరెక్టర్ గా ఉండేవారు. గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పలువురు డైరెక్టర్లు ఆయన్ను చూసి ఇండస్ట్రీలోకి వచ్చినవారే.

కేవలం సినిమా వాళ్ల మీదనే కాదు.. రాజకీయ నాయకుల మీద కూడా వర్మ సెటైర్లు వేస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తారు. అలాగే నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ ను కూడా వదిలిపెట్టరు వర్మ. అందరిపై విరుచుకుపడతారు. కానీ.. ఏపీ సీఎం జగన్ ను మాత్రం ఒక్క మాట కూడా అనరు. ఆయన్ను పల్లెత్తు మాట అనరు వర్మ. దానికి కారణం ఆయన మీద ఉండే అభిమానం కావచ్చు.

ram gopal varma turns ysrcp political activist

ram gopal varma turns ysrcp political activist

YCP Leader : ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన వర్మ

సాధారణంగా ఒక పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఆ పార్టీకి చెందిన నేతలు, అభిమానులు తిరిగి అటాక్ చేస్తుంటారు. చివరకు.. వర్మ కూడా ఏపీ ప్రభుత్వంపై ఎవరైనా ఏవైనా విమర్శలు చేస్తే ప్రతిపక్షాలపై ఆయన కూడా తిరిగి దాడి చేస్తున్నారు. అలా వైసీపీ ప్రభుత్వాన్న వర్మ కాపాడటం వెనుక ఒక మంత్రి ఉన్నారట. ఆ మంత్రి వల్లనే వర్మ అలా చేస్తున్నారని, ఆ మంత్రితో సినిమాను తీస్తున్నాడని అందుకే వైసీపీకి ఫేవర్ గా ఉంటున్నారని అంటున్నారు. అందుకే పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలా వర్మ మారిపోయారని అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp