Rashmika mandanna | పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నాపై ట్రోలింగ్‌.. ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika mandanna | పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నాపై ట్రోలింగ్‌.. ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2025,8:02 pm

Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘పుష్ప’, ‘ఆనిమల్’ వంటి బ్లాక్‌బస్టర్లతో సూపర్‌స్టార్ల సరసన నిలిచిన ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ‘కుబేర’ హిట్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘మైసా’, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు, పుష్ప 2లో నటిస్తోంది.

ర‌ష్మిక ఎమోష‌న‌ల్..

Rashmika Mandanna నా మొగుడు అతనే రష్మిక కూడా ఓపెన్ అయ్యిందిగా నెక్స్ట్ ఇయర్ పెళ్లేనా

Rashmika Mandanna : నా మొగుడు అతనే.. రష్మిక కూడా ఓపెన్ అయ్యిందిగా.. నెక్స్ట్ ఇయర్ పెళ్లేనా..?

అభిమానుల్లో అపారమైన ఫాలోయింగ్ ఉన్నా… ట్రోలింగ్ రూపంలో రష్మికపై అసహ్యం కలిగించే నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందిన తొలి నటినని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో తన సొంత రాష్ట్రం నుంచే నెగటివ్ రిప్లైలు ఎక్కువగా రావడం ఆమెను కలిచివేసింది.

ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ట్రోలింగ్ గురించి మాట్లాడిన రష్మిక..”నాకూ అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయి. కానీ అవి బయటపడాలని నేను కోరను. అందుకే కొంతమంది నన్ను పొగరుగా భావిస్తారు. వాస్తవం అది కాదు. కొందరు డబ్బులిచ్చి కూడా నాపై ట్రోలింగ్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రేమ ఇవ్వకపోయినా ఫర్వాలేదు… కానీ ద్వేషం మాత్రం వద్దండి.”ఎవరు ఎదిగినా సమాజం వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలనేది నా నమ్మకం అని కామెంట్ చేసింది. రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ, నెటిజన్లు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది