Ration Card : రేషన్ కార్డు దారులకు ముఖ్య గమనిక.. ఇవి రూల్స్ పాటిస్తే ఓకే.. లేదంటే చర్యలు తప్పవు!
Ration Card : దేశంలో రేషన్ కార్డు దారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైతే కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను పాటిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్, సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందవచ్చును. లేనియెడల వారిపై కఠిన చర్యలు తప్పవని దీని సారాంశం. సాధారణంగా పన్ను చెల్లింపులు చేయలేని వారికి.. ఆదాయ మార్గాలు తక్కువగా ఉండి.. పేదరికం అనుభవిస్తున్న వారు మాత్రమే దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ కార్డులను కలిగి ఉండటానికి అర్హులు.అయితే కొందరు పన్ను చెల్లించే స్థోమత కలిగిన వారు, ఆదాయ మార్గాలు ఉన్న వారు కూడా మనదేశంలో అక్రమంగా రేషన్ కార్డులను కలిగి ఉన్నారని వీరి ద్వారా అసలు లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Ration Card : అనర్హులకు ఇది మాత్రం హెచ్చరికే..
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులు ఎవరు కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండకూడదో ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే కార్డులు తీసుకోవడానికి అర్హులు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు ,పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చే వారికే రేషన్ కార్డు వర్తిస్తుంది. మాగాణి భూములు 3.5ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్న వారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్ , కారు, ట్రాక్టర్‌లు కలిగిన వారు..గ్రామాల్లో రూ.1.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం,నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే కార్డులను సంబంధిత ఎమ్మార్వో ఆఫీసులో సరెండర్ చేయాలని ఆదేశించింది.
ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందడానికి అర్హులని తాజా రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఎవరైనా ఇలాంటి టాక్సులు కడుతుంటే వారు అనర్హులని స్పష్టం చేసింది. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్ కార్డులు పొందడానికి అనర్హులు.గతంలో రేషన్ కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరెండర్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.