Rava Laddu Recipe : మృదువైన కమ్మటి రవ్వ లడ్డు ఈసారికి ఇలా ట్రై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rava Laddu Recipe : మృదువైన కమ్మటి రవ్వ లడ్డు ఈసారికి ఇలా ట్రై చేయండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 October 2022,4:00 pm

Rava Laddu Recipe : పండుగలకి ఎన్నో రకాల స్వీట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అందులో ఒక రకం స్వీట్ రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుని రకరకాల ట్రై చేస్తూ ఉంటారు. ఈ రవ్వ లడ్డు అంటే పంచదార పాకం పట్టి ఉంటారు. ఇలా కామన్ గా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వెరైటీగా కొత్తగా చేయబోతున్నాం అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం… ఈ మృదువైన కమ్మటి రవ్వ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పాలు యాలకులు పంచదార జీడిపప్పు బాదంపప్పు కిస్ మిస్ లు, నెయ్యి, ఎండు కొబ్బరి,నూనె మొదలైనవి…..

దీని తయారీ విధానం : ముందుగా రెండు గ్లాసుల రవ్వను తీసుకొని దాన్లో కాచి చల్లార్చిన పాలు అరగ్లాస్ తీసుకొని బాగా మెత్తగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.. పది నిమిషాల తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టి అది హీటెక్కిన తర్వాత ఆ పిండిని తీసుకొని చిన్నచిన్నగా పకోడీల్లాగా వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసి వాటిని కూడా ఆయిల్ లో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పట్టుకొని తీసి ఒక బౌల్లో పోసుకోవాలి.

Rava Laddu Recipe in Telugu

Rava Laddu Recipe in Telugu

తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు పంచదారను వేసి బరకగా పౌడర్ పట్టుకోని ఆ రవ్వమిశ్రమంలో పోసుకోవాలి. తర్వాత స్టౌ పై ఒకకడాయి పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల నెయ్యి ని వేసి దాంట్లో ఒక పది జీడిపప్పులు 10 బాదం పప్పులు కట్ చేసుకున్నవి కొంచెం కిస్మిస్లు వేసి ఎర్రగా వేయించి ఆ నెయ్యితో పాటు ఆ పిండిలో పోసి బాగా కలుపుకోవాలి. ఇక తర్వాత కొంచెం కొంచెం పాలు పోస్తూ రవ్వ లడ్డులా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా మృదువైన రవ్వ లడ్డు ఇలా కొత్తగా రెడీ అయిపోయాయి. ఇలా ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది