Ys Jagan : వైఎస్‌ జగన్ ఊ అన్నా ఊఊ అన్నా తగ్గేదే లే అంటున్న ఖిలాడి

Authored By Himanshi | The Telugu News | Published on: February 7, 2022, 9:00 pm

Ys Jagan : రవితేజ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా ఈ నెల 11 వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమా విడుదల విషయంలో కాస్త అనుమానాలు నెలకొన్నాయి. ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉండడం తో పాటు టికెట్ల విషయంలో క్లారిటీ రాలేదు. దాంతో ఈ సినిమా ను ఆ విషయాల పై క్లారిటీ వచ్చేంత వరకు వాయిదా వేసే అవకాశం ఉందని, అందుకే ఒక వారం రోజుల తర్వాత విడుదల చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మరో సారి విడుదల విషయమై క్లారిటీ ఇచ్చారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఊ అన్నా ఊఊ అన్నా కూడా సినిమా విడుదలను వాయిదా వేసేది లేదంటూ తేల్చి పారేశారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా తెలియజేశారు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే ఈ విషయం లో ఏపీలో అన్యాయం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఖిలాడి ని విడుదల చేయడానికి అంత సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే విడుదల ఆలస్యమైంది.. ఖిలాడి కి కేటాయించిన టైం లో విడుదల చేయకుంటే మళ్ళీ మూడు నాలుగు నెలల వరకు విడుదలకు ఇచ్చే అవకాశాలు లేవు. నిర్మాతల మండలి ఆదేశాల మేరకు విడుదల తేదీ విషయంలో మార్పులు చేసుకోవడం సాధ్యం కాదు అంటున్నారు.

ravi teja khiladi movie don't care about ys jagan decision

ravi teja khiladi movie don’t care about ys jagan decision

పెద్ద ఎత్తున సినిమాల విడుదల ఉన్న కారణంగా ఖిలాడి ని జగన్ నిర్ణయం తో సంబంధం లేకుండా విడుదల చేసి తీరాల్సిందే అని రవితేజ టీం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో రెడీ అవుతుండగా అతి త్వరలోనే అంటే సమ్మర్ లో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా రవితేజ నటిస్తున్న సినిమాల జాబితా పెద్దగానే ఉంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో ధమాకా అనే సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో సుధీర్వర్మ దర్శకత్వంలో రావణాసుర, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలను కమిట్ అయ్యాడు. ఇవి కాక చిరంజీవి సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రవితేజ రాబోయే రెండు సంవత్సరాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేందుకు మాస్ సినిమాలతో రెడీ అవుతున్నాడు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp