RBI 2022 New Rules : ఏటీఎం చార్జీల పెంపు నేటి నుంచే అమలు.. ఇవి గుర్తు పెట్టుకోండి..!
RBI 2022 New Rules : ఏటీఎం నుంచి తరచూ డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారికి రెండు రోజుల క్రితం కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి తీసుకొచ్చిన కొత్త రూల్స్ కొత్త ఏడాది అనగా నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
ఇకపై ఏటీఎం నుంచి పరిమితికి మించి లావాదేవీలు జరిపితే వినియోగదారులపై అధిక భారం పడనుంది. పరిమితి తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు జనవరి 1 నుంచి రూ.21 చెల్లించాల్సి ఉంటుందని అంతా గమనించాలి. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు ఇటీవల భారీగా పెరిగి పోయిన కారణంగా…
ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆయా బ్యాంక్ లు.. వారి వారు ఖాతాదారులు ఇప్పటికే ఈ సవరించిన చార్జీల సందేశాలు పంపినట్లు తెలిపాయి. ఖాతాదారులకు.. ప్రతినెల 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో మరో 3, నాన్- మెట్రో నగరాల్లో 5 ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.