Pawan Kalyan : టీడీపీతో లవ్ కు పవన్ కళ్యాణ్ ఊ అన్నా.. బీజేపీ ఊఊ అంటే పరిస్థితి?
pawan kalyan : 2024లో ఏపీలో వైకాపా ను గద్దె దించాలి అని చంద్రబాబు నాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తెలుగు దేశం పార్టీని ఇప్పటి నుండే సన్నద్దం చేస్తున్నాడు. తమ్ముళ్లతో తరచు మీటింగ్ లు పెట్టి వారిలో ఉత్సాహం నింపుతున్నారు. మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలనే పట్టుదల చంద్రబాబు నాయుడు లో క్లీయర్ గా కనిపిస్తుంది. జగన్ మాత్రం ఇప్పట్లో అధికారంను వదిలేసేందుకు సిద్దంగా లేను అన్నట్లుగా ఆయన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొత్తానికి ఎవరి దారిన వారు 2024 ఎన్నికలకు ముందస్తుగా సిద్దం అవుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు లవ్ ప్రపోజల్ పంపించిన విషయం తెల్సిందే. రెండు వైపుల ప్రేమ ఉండాల్సిందే అని కొందరు అనుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం చంద్రబాబుకు మరీ ప్రేమ ఎక్కువ అయినట్లుందని కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ ప్రేమ ఇప్పటిది ఏమీ కాదు. గతంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు.. అదే ఎన్నికల సందర్బంగా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పవన్ ప్రచారం చేయడం జరిగింది. కాని గత ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేశారు. ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేస్తే జగన్ కు లాభం జరిగింది.. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కు లాభం చేయాలంటూ వీరు విడి విడిగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ రెండు పార్టీలు కనుక కలిస్తే ఖచ్చితంగా జగన్ కు నష్టం తప్పదు అంటున్నారు. అందుకే జగన్ వ్యతిరేకులు అంతా కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాన్ లు కలవాలని కోరుకుంటున్నారు.
pawan kalyan: పవన్ కళ్యాణ్ నుండి చంద్రబాబు నాయుడు ప్రపోజల్ కు స్పందన ఏది?
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. రెండున్నర ఏళ్ల పాటు పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎలా మారుతాయో చెప్పలేం. కనుక చంద్రబాబు నాయుడు తో కలిసి నడిచేందుకు గాను పవన్ కళ్యాణ్ ఊ అనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు కనుక వారు ఊ అంటారా లేదా ఊఊ అంటారా అనేది చూడాలి. ఒక వేళ చంద్రబాబు నాయుడుతో కలిసేందుకు గాను బీజేపీ ఊఊ అంటే పవన్ కళ్యాణ్ స్పందన ఏంటీ.. రెండు పార్టీల్లో ఒక్కదాన్ని ఎంపిక చేసుకో అంటే అప్పుడు జనసేన పార్టీ దారి ఎటు వైపు అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నోరు విప్పితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.