realme 9 pro plus to launch in india in feb 16 th
Realme 9 Pro Series : చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి త్వరలో రెండు కొత్త ఫోన్స్ అందుబాటులోని రాబోతున్నాయి. భారత్‌లో వీటి లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ సంస్థ రియల్‌మీ ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌లో రియల్‌మీ 9 ప్రో సిరీస్ మొబైళ్లను విడుదల చేయనున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ సిరీస్ ఫోన్ల విడుదల గురించి రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ సైతం ప్రకటించారు. ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 1.30 కు వర్చువల్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌ఫోన్లను రియల్‌మీ అదే రోజు రిలీజ్ చేయనుంది.కొత్త సంవత్సరంలో స్మార్ట్ బ్రాండ్లు వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 9 ప్రో సిరీస్ నుంచి ఒకేసారి రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 9 ప్రో సిరీస్ ప్రారంభ ధర రూ.15వేలకు పైనే ఉంటుందని రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ తెలిపారు. యూట్యూబ్‌లో జరిగిన ఆస్క్ మాధవ్ సెషన్‌లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ రెండు మొబైళ్లు 5జీ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తాయన్నారు.ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, లైట్ షిఫ్ట్ డిజైన్, 50 ఎంపీ సోనీ సెన్సార్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్‌వోసీ ప్రాసెసర్, 60 వాట్స్ సూపర్‌డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ లాంటి ఫీచర్లు రియల్‌మీ 9ప్రో ప్లస్‌లో ఉండనున్నాయి.
realme 9 pro plus to launch in india in feb 16 th
ఈ మొబైల్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీతో రానుండగా.. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని లీకుల ద్వారా వెల్లడైంది. రియల్ మీ 9 ప్రో.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో నడవనుంది. అలాగే ఈ ఫోన్‌లో కూడా అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. అందులో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ మొబైల్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని సమాచారం. రియల్‌మీ 9 ప్రో ప్లస్ బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.20,999గా ఉంటుందని సమాచారం లీక్ అయింది. రియల్‌మీ 9 ప్రో ప్రారంభ ధర రూ.16,999గా ఉంటుందట.
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
This website uses cookies.