Realme C30 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్ మీ నుంచి మరో కొత్త మోడల్ బడ్జెట్ ధరలో మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. రియల్ మీ సీ సిరీస్‌లో భాగంగా సీ 30 ఫోన్ ఇవాళ మార్కెట్లోకి జూన్ 27 కి లాంచ్ కానుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి తేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని ఇండియాలో సేల్ ప్రారంభం కానుంది. అయితే బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ సీ30 లాంచ్ కానుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మీ సీ 30 మొబైల్ బ్యాక్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఏఐ కలిగి ఉంది. ఇందులో ఆక్టాకోర్ Unisoc T612 ప్రాసెసర్, 5000 ఎంహెచ్ కెపాసిటీతో బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 3 కార్డ్ స్లాట్ ఉన్నాయి. ఫుల్ చార్జింగ్ చేస్తే ఒక రోజంతా ఫోన్‌ను ఆపరేట్ చేసేలా తయారు చేశారు. అలాగే అల్ట్రా స్లిమ్ వర్టికల్ స్ట్రైప్ డిజైన్‌తో 0.85సెం.మీ మందంతో ఈ ఫోన్ డిజైన్ చేయబడింది. దీని బరువు 182 గ్రాములు. చూడటానికి స్టైలిష్‌గా ఉండటంతో పాటు తేలికగా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి, ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది.

Realme C30 : రెండు వేరియంట్లలో..
రియల్ మీ సీ 30 రెండు వేరియట్లలో అందుబాటులోకి సదరు కంపెనీ తీసుకొచ్చింది. ప్రస్తుతం బ్లూ, గ్రీన్ కలర్స్‌లో రియల్‌మీ సీ30 మొబైల్ అందుబాటులో ఉంది. కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ సీ 30 2 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ ధర రూ.7499 కి గా ఉంది. అలాగే రియల్ మీ సీ 30 3జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ ధర రూ.8299 గా లాంచ్ ఆఫర్ తో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునేవారు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మీ ఆర్డర్‌ని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.