Home » Exclusive » Redmi Is Always Launching Your 11 5g Smartphone
Exclusive

Redmi 11 5G : రెడ్ మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ ఎప్పుడంటే.. త‌క్కువ బ‌డ్జెట్ లో అదిరిపోయే ఫీచ‌ర్స్

Authored By
mallesh
The Telugu News | Updated on: May 30, 2022 2:08 pm
Advertisement

Redmi 11 5G : ఇండియాలో రెడ్ మీ ఫోన్ ల‌కు మంచి డిమాండ్ ఉంది. ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌రికొత్త ఫీచ‌ర్స్ తో మొబైల్స్ ని లాంచ్ చేస్తోంది. భార‌త్ లో వినియోగ‌దారుల‌ను దృష్టిలో పెట్టుకుని వారికి అనుగుణంగా అదిరిపోయే ఫీచ‌ర్స్ తో త‌క్కువ బ‌డ్జెట్ లోనే అందుబాటులోకి ప‌లు మొబైల్స్ లాంచ్ చేస్తోంది. ప్ర‌స్తుతం రెడీ మీ 10కు కొన‌సాగింపుగా మ‌రో ఫోన్ లాంచ్ చేయ‌నుంది. షావోమీ నుంచి రెడ్ మీ 11 5జీ స్మార్ ఫోన్ ను బ‌డ్జెట్ లో తీసుకురానుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ ఉండ‌నుంది.

Advertisement

అలాగే 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 90 హెచ్‌జ‌డ్ రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌సీడీ ప్యానెల్‌తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. రెడ్ మీ 11 5జీ రెండు బ్యాక్ కెమెరాల‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ను అందిస్తోంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయ‌నుంద‌ని స‌మాచారం. పవర్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. కాగా 64 జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్‌లో ఉంటుంది.

Redmi is always launching your 11 5g-smartphone

Advertisement

స్టోరేజ్‌ను పెంచుకునేందుకు వీలుగా మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. రెడ్‌మీ 11 5జీ మొబైల్ ఇండియాలో వ‌చ్చే నెల జూన్ లాస్ట్ వీక్ లో లాంచ్ అయ్యే అవకాశాలున్న‌ట్లు తెలుస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ఉంటుందని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. కాగా షావోమీ త్వరలోనే ఈ మొబైల్ అప్డేట్ ఇవ్వ‌నుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి