Redmi : రెడ్‌మీ నయా ఫోన్స్.. సూపర్ ఫీచర్స్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Redmi : రెడ్‌మీ నయా ఫోన్స్.. సూపర్ ఫీచర్స్..

Redmi : ప్రస్తుత యుగం అంతా స్మార్ట్ ఫోన్ మయం అయింది. ఎవరి చేతిలో చూసినా దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు అప్ డేట్ ఫీచర్స్‌తో పలు సెల్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రెడ్ మీ కంపెనీ కొత్త ఫోన్లను అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :26 February 2022,3:00 pm

Redmi : ప్రస్తుత యుగం అంతా స్మార్ట్ ఫోన్ మయం అయింది. ఎవరి చేతిలో చూసినా దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు అప్ డేట్ ఫీచర్స్‌తో పలు సెల్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రెడ్ మీ కంపెనీ కొత్త ఫోన్లను అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో 4జీ, రెడ్‌మీ నోట్ 11ప్రో+ 5జీ మొబైల్స్ త్వరలోనే మార్కెట్ లోకి రానున్నాయి. మార్చి 9వ తేదీన వీటిని ఇండియాలో విడుదల చేయనున్నట్టు రెడ్ మీ ఇండియా అనౌన్స్ చేసింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.రెడ్ మీ 11ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, 120 హెట్జ్ అమోలెడ్ డిస్‌ ప్లేతో రానుంది. మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో ఈ మోబైల్ మార్కెట్ లోకి వస్తోంది. దీనికి మొత్తంగా నాలుగు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. 16 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా సైతం రూపొందించారు. ఇక దీని బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. ఈ ఫోన్‌ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

redmi new phones in india

redmi new phones in india

Redmi : స్పెసిఫికేషన్స్ ఇవే..

రెడ్‌మీ నోట్ 11 ప్రో, 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది. ఈ మొబైల్‌‌కు వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. దీనితో పాటు ఫ్రంట్ కెమెరాను 16 మెగాపిక్సల్ గా రూపొందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది