Redmi Note 11 : రెడ్‌మీ నోట్ 11 సేల్.. అతి త‌క్కువ ధ‌ర‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Redmi Note 11 : రెడ్‌మీ నోట్ 11 సేల్.. అతి త‌క్కువ ధ‌ర‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో..

 Authored By sandeep | The Telugu News | Updated on :11 February 2022,1:30 pm

Redmi Note 11 : చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ ఇటీవ‌ల కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన విష‌యం తెలిసిందే. రెడ్‌మీ నోట్‌ 11 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు. రెడ్‌మీ నోట్ సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్స్ అన్నీ పాపులర్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. అయితే రెడ్‌మీ ఇండియా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో సేల్ ప్రారంభించింది. రెడ్‌మీ నోట్ 11 రూ.15,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయింది. రెడ్‌మీ నోట్ 11 మోటో జీ51, రియల్‌మీ 8 లాంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది. ఇది 5జీ స్మార్ట్‌ఫోన్ కాదు. 4జీ ఎల్‌టీఈ నెట్వర్క్ సపోర్ట్ మాత్రమే ఉంది.రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది.

4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999. హొరైజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్‌బర్స్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌తో పాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు.రెడ్‌మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ,

Redmi Note 11 first sale today

Redmi Note 11 first sale today

Redmi Note 11 : వారికి బంప‌ర్ ఆఫ‌ర్..

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్ కెమెరా(రెడ్‌ మీ 11 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ రియర్‌ కెమెరా), 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్ , బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్ ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి కొత్త రెడ్‌మీ నోట్ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. గతేడాది రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌కు భారీ ఆదరణ వచ్చింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగా, రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ రెండ స్మార్ట్‌ఫోన్స్‌ బడ్జెట్‌ ధరలో ఉండేలా రెడ్‌మీ రూపొందించింది

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది