Redmi Note 11 Pro : అద్భుతమైన ఫీచర్లతో రెడ్ మీ నోట్ 11 ప్రో లాంచ్.. ధరెంతో తెలుసా?
Redmi Note 11 Pro : రెడ్ మీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. జియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ ను భారత్ లో లాంచ్ చేశారు. రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ లో భాగంగా.. రెడ్ మీ నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ వేరియంట్ల ఫోన్లు రిలీజ్ అయ్యాయి.6 జీబీ ప్లస్ 128 జీబీ బేసిక్ వేరియంట్ 11 ప్రో మోడల్ ధర రూ.17,999 గా నిర్ణయించారు.
అదే 8 జీబీ ర్యామ్ వేరియంట్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ మార్చి 23నుంచి ప్రారంభం కానున్నాయి.రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ బేసిక్ వేరియంట్ 6 జీబీ ప్లస్ 128 జీబీ ధర రూ.19,999 కాగా.. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.21,999, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.23,999 గా నిర్ణయించారు. 11 ప్రో ప్లస్ సేల్స్ కూడా మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.

redmi note 11 pro series launched in india with best features
Redmi Note 11 Pro : స్పెసిఫికేషన్లు ఇవే
మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్, 4జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లలో రెడ్ మీ నోట్ 11 ప్రో లాంచ్ అయింది.ఇక.. రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్ , 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.