Redmi Note 11 SE : రెడ్‌మీ నుంచి లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ రిలీజ్..బెస్ట్ ఫీచర్స్ దీని సొంతం!

Authored By mallesh | The Telugu News | Published on: August 27, 2022, 12:20 pm

Redmi Note 11 SE : ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ దిగ్గజం రెడీ మీ తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీడియం రేంజ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ను తీసుకొచ్చినట్టు మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా కాలంగా తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే యూజర్లకు ఈ మోడల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. రెడ్‌మీనోట్ 11 ఎస్ఈ మార్కెట్లో కొత్త సునామీని సృష్టిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Redmi Note 11 SE  : అదిరిపోయే ఫీచర్స్ దీనిసొంతం..

దేశీయ విపణిలోకి విడుదల రెడ్‌మీనోట్ 11 ఎస్ఈ మొబైల్ ధర రూ.15,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64MP కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ వెర్షన్‌లో ఉన్న మొబైల్స్‌కు రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ గట్టి పోటీ ఇవ్వనుందని టాక్. ఇక ఇప్పటికే రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, నోట్ 11ఎస్, నోట్ 11,నోట్ 11టీ 5జీ మోడల్స్ ఉండనే ఉన్నాయి.ఇప్పుడు ఇదే సిరీస్ లో కొత్తగా రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ వచ్చి చేరింది.

Redmi Note 11 SE low budget release

Redmi Note 11 SE low budget release

రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో రూ.1,000 వెంటనే డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్‌తో రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో 2022 ఆగస్ట్ 31న ఈ సేల్ ప్రారంభం కానుంది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అమొలెడ్ డాట్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ నార్జో 30, వివో వై73, రెడ్‌మీ నోట్ 10ఎస్, రియల్‌మీ 8 లాంటి మోడల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది.

Also read

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp