Jio 5G SmartPhone : తక్కువ బడ్జెట్లో రిలయన్స్ జియో 5G స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio 5G SmartPhone : తక్కువ బడ్జెట్లో రిలయన్స్ జియో 5G స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే…

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,3:40 pm

Jio 5G SmartPhone : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని కావడం లేదు. స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. అవి అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి వచ్చాం. స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఫోన్లోనే కనిపిస్తుంటుంది. అన్ని పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నాం. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరికి ఫోన్ అవసరం. అందుకని మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. త్వరలో మన దేశంలో 5జి టెక్నాలజీ రాబోతుంది. ఇందుకోసం పలు టెలికం కంపెనీలు పోటీ పోటీగా 5జి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్లు 5జి వచ్చాయి. మరిన్ని కంపెనీలు 5జీ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక టెలికాం కంపెనీలో దూకుడు ప్రదర్శిస్తున్న రిలయన్స్ జియో కూడా 5జీ సేవలపై దృష్టి పెట్టింది. దేశంలో అక్టోబర్ నుంచి 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంపై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. అక్టోబర్ నాటికి 5జీ సేవలను ప్రారంభిస్తామని ఆ తర్వాత నాటికి దేశంలో చిన్న పెద్ద నగరాలలో విస్తరింప చేస్తామని అన్నారు.

Reliance Jio 5G smartphone in low budget

Reliance Jio 5G smartphone in low budget

ఈ ప్రకటన తర్వాత దేశంలోని అనేక మొబైల్ తయారీ కంపెనీల మధ్య పోటీ ప్రారంభం అయింది. రిలయన్స్ జియో తను మొట్టమొదటి తక్కువ ధరకు 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నివేదికల ప్రకారం రిలయన్స్ 5జి స్మార్ట్ ఫోన్ ను ఈనెలాఖరులో ఆగస్టు 29న ప్రారంభించనునట్లు తెలిపింది. దీంతో జియో ఫోన్ 5జి ఎంట్రీ లెవెల్ మోడల్ అయినా జియో ఫోన్ నెక్స్ట్ గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు త్వరలో జియో నుండి 5G సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే జియో కొత్త స్మార్ట్ ఫోన్ ద్వారా 10000 ఉండనుంది. దీని ద్వారా సామాన్యులకు కూడా ఈజీగా అందుబాటులోకి వస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది