జగన్ ను ఢీకొట్టాలంటే.. ఆ ప్రయోగం చేయాల్సిందేనా? ప్రతిపక్షాలకు జగన్ అడ్డంగా దొరికిపోయారు?
ఏపీ సీఎం వైఎస్ జగన్.. నెంబర్ వన్ సీఎం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీని కూడా మిస్ కాకుండా.. ప్రతి ఒక్కటి అమలు చేస్తూ పోతున్నారు జగన్. అలాగే.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. దేశం గర్వించే విధంగా.. దేశమంతా ఏపీవైపు చూసే విధంగా.. చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి పథకాలను ఏపీలో ప్రారంభించి నెంబర్ వన్ సీఎం అనిపించుకున్నారు సీఎం జగన్.

religious conspiracy on ap cm ys jagan
మరోవైపు పేదలకు సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. ఏపీలోని 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గొప్ప సీఎం అనిపించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను ఢీకొట్టడం ఎవరి వల్ల అయినా అవుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే.. ప్రతిపక్షాలకు జగన్ ను విమర్శించడానికి ఏదో ఒక తప్పు దొరకాలి కదా. ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇంకా ఏం కావాలి.. దీంతో ఎలా జగన్ ను ఢీకొట్టాలా? అనే ప్లాన్ ను ప్రతిపక్షాలు చేస్తన్నాయి.
మతాన్నే టార్గెట్ చేస్తూ?
అందుకే… సీఎం జగన్ ను ఇరికించడానికి ప్రతిపక్షాలకు దొరికిన ఒకే ఒక చాన్స్ మతం. అవును.. జగన్ ని క్రిస్టియన్ గా చిత్రీకిరిస్తూ.. హిందూ మతంపై, హిందూ దేవాలయాలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా అన్ని సీన్లను క్రియేట్ చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతర్వేది ఘటన కావచ్చు.. దుర్గగుడి రథం ఘటన కావచ్చు.. ఇలా పలు ఘటనలపై ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను నిందిస్తున్నాయి ప్రతిపక్షాలు.
కావాలని పక్కాగా సీఎం జగన్ పై మతకుట్రకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా మతాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాజకీయ నాయకుడు కూడా కుట్ర చేయలేదు. కానీ.. తొలిసారిగా ఏపీలో ఒక ముఖ్యమంత్రిని మతంతో టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన మరో విధ్వంసం దానికి బెస్ట్ ఉదాహరణ. కావాలని.. సీఎం జగన్ పర్యటనకు ముందే రాముడి గుడిలో విధ్వంసం చోటు చేసుకుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందేనని.. కావాలని సీఎం జగన్ ను బ్యాడ్ చేయడం కోసం.. మతం పేరుతో టార్గెట్ చేయడం కోసం ప్రతిపక్షాలు చేయించిన కుట్ర అని స్పష్టం అవుతూనే ఉన్నది. అయితే.. ఇలా.. సీఎం జగన్ ను మతం పేరుతో టార్గెట్ చేసి కుట్రలు చేయిస్తున్నది ఎవరు? అనే విషయం ఏపీ ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్లకు తెలుసు. కావాలని ఎవరు సీఎం జగన్ పై బురద జల్లుతున్నారో? అటువంటి మతతత్వ పార్టీలను ఏపీ నుంచి తరిమికొట్టాల్సింది ప్రజలే.