Categories: News

Srimalika | పురాణపండ ‘ శ్రీమాలిక ‘ తో మంత్రులు రేణుకా చౌదరి, నారాయణ, దుర్గేష్ శ్రీపదార్చన !

Advertisement
Advertisement

Srimalika | గోరంత భక్తి పొంగే వారింట కొండంత కటాక్షం కురిపించే మహాస్వరూపం, మహా శక్తి , మహానుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ చరణాల చెంతకు ఒక నాలుగు వందల పేజీల అపురూపాన్ని మహాద్భుత మంత్ర పేటిక ‘ శ్రీమాలిక ‘ గ్రంధంగా వేల వేల ప్రతులు సమర్పించడం, సుజనా చౌదరి సారధ్యంలో ఈ శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపైనే కాకుండా మరికొందరు ప్రముఖులు న్యూ ఢిల్లీ , హైదరాబాద్ , రాజమండ్రి , కాకినాడ లలో సైతం సీనియర్ ఐఏఎస్ అధికారులకు ,రాజకీయ యోధులకు పరమ పవిత్ర కానుకగా సమర్పించడం ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి.

Advertisement

#image_title

కార్యనిర్వహణాధికారి కుర్చీలో కూర్చుని అతి తక్కువ సమయంలో సర్వ సమర్థునిగా అన్ని వర్గాల చేత చక్కని కీర్తిని అమ్మవారి అనుగ్రహంతో సంపాదించుకున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇ.ఓ. శీనా నాయక్ ఈ ప్రతులను అమ్మవారి సమక్షంలో ఈ శరన్నవరాత్రుల్లో స్వీకరించి శ్రీమాలిక లోపలి ఆర్షధర్మపు కంటెంట్ ని ప్రశంసించారు.

Advertisement

ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత మంత్ర విద్యలతో, స్తోత్ర విద్యలతో భక్తి నిండిన హృదయాలకు ‘ శ్రీమాలిక ‘ మహా గ్రంథ పరిమళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పధంలో దూసుకుపోయి, సుసంపన్నమవ్వాలనే ఆకాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రాలను ముద్రించి మరీ శ్రీమాలిక బుక్ ను అద్భుతంగా అపూర్వంగా అందించడం విశేషం. ఈ మొత్తం శ్రీ కార్యాన్ని కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య రాజీపడకుండా మంచి క్వాలిటీ తో సమర్పించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

న్యూఢిల్లీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి, విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి. నారాయణ , తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , హైదరాబాద్ లో తెలంగాణ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి శైలజ రామయ్యర్ తదితరులు ఈ అద్భుతగ్రంధం రచనా సంకలన కర్త , పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభా సామర్ధ్యాలపై అభినందనలు వర్షించడం ప్రత్యేకంగానే పేర్కొనాలి.

ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకార్యాలెన్నింటికో ఈ శ్రీమాలిక గ్రంధాన్ని నిస్వార్ధ యజ్ఞసేవగా అందించడాన్ని జనసేన శ్రేణులు, తెలుగుదేశం సీనియర్ నాయకులూ అభినందిస్తున్నారు.

ఎన్నో కష్టాలెదుర్కొని కూడా పురాణపండ శ్రీనివాస్ నిరాఘాటంగా చేస్తున్న ధార్మిక సేవ చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు సైతం చేయట్లేదని తెలుగురాష్ట్రాలలో పలువురు స్పష్టంగా పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎంతో భక్తితో ఎందరెందరో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ శ్రీమాలికను తమ అనుచరగణాలచేత పసుపు కుంకుమలతో పంచి పెట్టించినట్లు తెలుగు మహిళలు ముక్తకంఠంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

8 minutes ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

40 minutes ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

1 hour ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

3 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

4 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

5 hours ago

Today Gold Rate on Jan 29th 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు..ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం , వెండి ధరలు

Today Gold Rate on Jan 29th 2026 :  బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…

6 hours ago