Viral Video : జర్నలిస్ట్ ముఖంపై వాలిన దోమ… ఏం చేసిందో చూస్తే నవ్వపుకోలేరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : జర్నలిస్ట్ ముఖంపై వాలిన దోమ… ఏం చేసిందో చూస్తే నవ్వపుకోలేరు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,8:00 pm

Viral Video : వార్తలను నివేదించేటప్పుడు రిపోర్టర్లు వారి చుట్టూ ఏం జరుగుతున్న పట్టించుకోకుండా చాలా శ్రద్ధగా ఉంటారు. అయితే ఎంత శ్రద్ధగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని అంతరాయాలు ఏర్పడుతుంటాయి. రిపోర్టర్లు సీరియస్ గా వార్తలు చెబుతున్నప్పుడు మనుషులు లేదా జంతువులు వారిని డిస్టర్బ చేయడం దీంతో సీరియస్ వార్తలు కాస్త ఫన్నీగా మారడం చాలా వీడియోలలో ఇప్పటికే మనం చూసాం. అయితే తాజాగా ఓ దోమ కారణంగా ఒక లేడీ రిపోర్టర్ తీవ్ర ఇబ్బందిగా గురైంది. ఇక దానిని చంపే క్రమంలో ఆమెను ఆమె గాయపరచుకుంది. దీంతో సీరియస్ గా రిపోర్ట్ చేస్తున్న వీడియో కాస్త ఫన్నీగా మారింది. ఇక ఆ వీడియోలు ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే….

ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రియా అనే టీవీ రిపోర్టర్ ఆస్ట్రేలియా టుడే షో కోసం పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఆండ్రియా ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో వరదల గురించి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఆమె ముఖం పై ఒక దోమ వాలింది. ఇక దానిని చంపే క్రమంలో లేడీ రిపోర్టర్ తన ముఖం మీద బలంగా కొట్టుకుంది. అయితే మొఖంపై ఆమె చేతితో కొట్టుకున్న దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక ఈ వీడియోను సహుద్యోగులు చూసి తెగ నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో పై జోకులు వేసి మరి వారు నవ్వించారు. దీంతో టీవీ రిపోర్టర్ న్యూస్ కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో@abcrothers అనే ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాపం ఆండ్రియా అని కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఈ వీడియోని ఐదుసార్లు చూసి నవ్వుకున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు ఆండ్రియా దోమల నుంచి రక్షణ పొందేందుకు ముఖానికి ఏకంగా నెట్ ధరించి స్టూడియో కు వచ్చింది. ఇక దానికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె నెట్టింట పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ సరదాగా క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ వీడియో కూడా తెగ వైరల్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by Andrea Crothers (@abcrothers)

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది