Revanth Reddy : కరోనా కల్లోలంపై ప్రభుత్వాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి? 5 లక్షల వరకు వైద్య సాయం అందించండి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కరోనా కల్లోలంపై ప్రభుత్వాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి? 5 లక్షల వరకు వైద్య సాయం అందించండి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 April 2021,10:58 am

Revanth Reddy : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దేశప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వల్ల రోజూ వందల మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా రోజురోజుకూ విపరీతంగా వ్యాప్తి చెందుతుండటంతో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తున్నా… ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవడం లేదని… కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా బారిన పడిన వాళ్లకు ఆక్సీజన్ అందడం లేదు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు లేవు.. బెడ్స్ ఖాళీ లేవు. దీంతో కరోనా రోగులకు చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా కల్లోలంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

revanth reddy about one nation and one health policy

revanth reddy about one nation and one health policy

దేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతుంటే… కేంద్రం ఎందుకు నియంత్రించలేకపోతోందంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… కనీసం కేంద్రానికి ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కూడా తెలియదా? కేంద్రం ఎందుకు వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీని తీసుకురావడం లేదు. కరోనా వ్యాక్సిన్ కొరత ఎందుకు వస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలను ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదు. ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించాలి… అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Revanth Reddy : పీఎం కేర్ ఫండ్ ద్వారా కరోనా రోగులకు వైద్య పాలసీని అందించండి

పీఎం కేర్ ఫండ్ ద్వారా కరోనా వైరస్ సోకిన వాళ్లకు వైద్య పాలసీని అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వైద్య పాలసీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందించాలని… దాని వల్ల కరోనా వైరస్ సోకిన వాళ్లకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తవని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేద ప్రజలు కరోనా వైరస్ చికిత్స చేయించుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు పోసి వైద్యం చేయించుకునే స్థితిలో లేరని… అందుకే కరోనా రోగులకు వైద్య పాలసీని తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనా మహమ్మారిపై వ్యవహరిస్తున్న తీరుపై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న 22 మెడికల్ కాలేజీలను కూడా కరోనా చికిత్స కోసం వాడాలంటూ రేవంత్ రెడ్డి సూచించారు.. ప్రభుత్వం కరోనా కోసం ప్రత్యేకమైన డ్యాష్ బోర్డు తీసుకొచ్చిందని వెల్లడించిందని.. ప్రభుత్వం తీసుకొచ్చిన డ్యాష్ బోర్డ్ ఎక్కడుందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్య మంత్రి ఒక మాట చెబుతారు… మెడికల్ డైరెక్టర్ ఇంకో మాట చెబుతారు. ఇద్దరి మాటల్లో పొంతనే ఉండటం లేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది