Revanth Reddy | రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ చ‌లానాలు.. కాన్వాయ్‌లోని అన్ని వాహ‌నాల‌కి ఒకే నెంబ‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy | రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ చ‌లానాలు.. కాన్వాయ్‌లోని అన్ని వాహ‌నాల‌కి ఒకే నెంబ‌ర్

 Authored By sandeep | The Telugu News | Updated on :3 September 2025,2:00 pm

Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు రోడ్లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. డ్రైవర్లు ఎలాంటి భయమూ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రజలు అంటున్నారు. అర్ధరాత్రిళ్లు కూడా ఈ వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.

#image_title

ఎవ‌రు క‌ట్టాలి..

పగలు కూడా సెక్యూరిటీ లేకుండా ఇష్టారీతిన సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రజల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా సీఎంల కాన్వాయ్‌ వాహనాలు ఎప్పుడూ భద్రతా సిబ్బందితోనే కదులుతాయి. కానీ ఈ సందర్భంలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాన్వాయ్‌లోని వాహనాలన్నీ TG09 RR0009 నంబర్‌తోనే ఉన్నాయనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే నంబర్‌తో పలు వాహనాలు నడవడం ఎలా సాధ్యమో అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ట్రాఫిక్‌ శాఖ దీనిపై ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ వాహనాలపై ఇప్పటికే మొత్తం 18 పెండింగ్‌ చలానాలు ఉన్నాయని సమాచారం. వాటి మొత్తం విలువ రూ.17,795 వరకు చేరింది. ఈ చలానాలను ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న ఇప్పుడిప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాహనాలు కాన్వాయ్‌లో ఉన్నందున వాటికి బాధ్యత ఎవరికి ఉంటుందో అనేది ప్రజల సందేహం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది