Revanth Reddy సర్వే సత్యనారాయణ sarve satyanarayana కు కాలం కలిసివచ్చిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్న సర్వే సత్యనారాయణ sarve satyanarayana కు రేవంత్ రాక ప్లస్ పాయింట్ గా మారిందని కేడర్ చర్చించుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కు కాలం కలిచి వచ్చినట్టేనా ? తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా యువ నేత, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్న నేపథ్యంలో సర్వే సత్యనారాయణ sarve satyanarayana మళ్లీ పుంజుకుంటారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలక నేతగా ఉన్న సర్వే సత్యనారాయణ పక్కా తెలంగాణ వాదిగా పేరుబడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన అప్పట్లో కేంద్రాన్ని ఒప్పించినవారిలో ఒకరుగా గుర్తింపు పొందారు. అయితే.. వరుసగా పార్టీ ఓటమి, తెలంగాణ ఇచ్చినా.. పార్టీ పుంజుకునేలా క్షేత్రస్థాయి నాయకత్వం పనిచేయకపోవడం వంటి పరిణామాలపై బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అంతేకాక అప్పటి కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపైనా సర్వే సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ కాదు.. ఉత్తర కుమారుడని బహిరంగ సభల్లోనే సెటైర్లు పేల్చారు. దీంతో ఇది వివాదంగా మారి.. సర్వే సత్యనారాయణను సస్సెండ్ చేసే వరకు విషయం దారి తీసింది.
అయితే.. తాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడినని.. తనను సస్పెండ్ చేసే అవకాశం లేదని సర్వే సత్యనారాయణ వాదిస్తూ ఎదురు దాడి చేశారు. ఇక, ఇటీవల కాలంలో సర్వే సత్యనారాయణను బీజేపీ నేతలు కలవడం.. దీనిపై సర్వే సత్యనారాయణ గుంభనంగా ఉండడం..లోపాయికారీగా వ్యవహరించడం.. వంటి పరిణామాలతోపాటు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక, పుంజుకుంటుందా ? అనే సందేహాలు రావడంతో సర్వే సత్యనారాయణ పార్టీ మారడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే.. రాజ్యసభ సీటును ఆశించిన సర్వే సత్యనారాయణకు బీజేపీ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. దీంతో సర్వే సత్యనారాయణ సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే.. ఇప్పుడు పార్టీలో కొత్త పవనాలు చోటుకోవడం.. రేవంత్ రెడ్డి Revanth reddy వంటి కీలక నాయకుడు పగ్గాలు చేపట్టడంతో సర్వే సత్యనారాయణకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. రేవంత్ Revanth reddy కు సర్వే సత్యనారాయణకు మధ్య మంచి సంబంధాలు ఉండడం.. యువ నాయకత్వం రావాలంటూ.. గతంలోనే సర్వే సత్యనారాయణ ప్రకటించడం వంటివి .. వీరిద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా సర్వే సత్యనారాయణ రేవంత్ Revanth reddy కోసమే మల్కాజ్‌గిరి సీటు వదులుకున్నారు.
దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రేవంత్ కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయని సర్వే సత్యనారాయణ వంటి సీనియర్ నేతల మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పటికే రేవంత్‌కు పీసీసీ పదవి రావడాన్ని చాలా మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్న సమయంలో సర్వే సత్యనారాయణ వంటి వారు తన పంచన ఉంటే .. మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక .. మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందనేది మరో వ్యూహంగా చర్చ సాగుతోంది. అదేసమయంలో .. తన తరఫున వకాల్తా పుచ్చుకున్న సర్వే సత్యనారాయణకు .. మద్ధతు పలికినట్లు అవుతుందని రేవంత్ భావిస్తున్నారని కేడర్ చెబుతోంది. దీంతో ఇక సర్వే సత్యనారాయణకు మంచిరోజులు వచ్చినట్లేనన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఇన్నాళ్లు మౌనమునిలా ఉన్న సర్వే సత్యనారాయణకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి దీనిపై సీనియర్లు ఏవిధంగా స్పందిస్తారన్నదే కీలకంగా మారింది.
ఇది కూడా చదవండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?
ఇది కూడా చదవండి ==> TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..?
ఇది కూడా చదవండి ==> పాదయాత్రలకు పార్టీలు రెడీ.. హుజూరాబాద్ గెలుపును పాదయాత్రలు డిసైడ్ చేస్తాయా?
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.