Harish Rao : నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Harish Rao : నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?

Harish Rao కేసీఆర్ కు కుడి ఎడమ భుజాలుగా నిలిచిన ఈటల రాజేందర్, హరీష్ రావులు Harish Rao ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతారం మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరిస్థితుల్లో మార్పులు ప్రారంభమయ్యాయి.. మున్సిపోల్ ముగిసిన అరగంటలోనే ఈటెల రాజేందర్ పై వేటు పడింది. దీంతో ఇక రెండో కీలక నేత పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ ను పంపించినట్లే […]

 Authored By sukanya | The Telugu News | Updated on :11 July 2021,6:50 pm

Harish Rao కేసీఆర్ కు కుడి ఎడమ భుజాలుగా నిలిచిన ఈటల రాజేందర్, హరీష్ రావులు Harish Rao ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతారం మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరిస్థితుల్లో మార్పులు ప్రారంభమయ్యాయి.. మున్సిపోల్ ముగిసిన అరగంటలోనే ఈటెల రాజేందర్ పై వేటు పడింది. దీంతో ఇక రెండో కీలక నేత పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ ను పంపించినట్లే హరీష్ రావుకు ఉద్వాసన తప్పదని .. వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నాందిగా ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్  Harish Rao కు .. ట్రబుల్స్ స్టార్టయ్యాయని కేడర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండోదఫా అధికారంలోకి రాగానే, కేసీఆర్ హరీష్ రావు Harish Rao ను మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల్లో కారు పదహారు బోల్తా కొట్టడంతో కేసీఆర ఉన్నపళంగా హరీష్ రావు Harish Rao ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ప్లానింగ్ లేని ఫైనాన్స్ ను ఇచ్చి, సిద్ధిపేటకే పరిమితం చేశారు. ఆర్థిక మంత్రి లేకుండానే, ఆ శాఖకు సంబంధించిన సమీక్షలు, నిర్ణయాలు కూడా జరిగిపోయాయి..

CM KCR Check to Hrish rao

CM KCR Check to Hrish rao

Harish Rao చేజేతులారా ..

హరీష్ రావును పక్కన పెట్టడంతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. తనకు జరిగిన అవమానాలను హరీష్ రావు భరించారని, అదే ఇప్పుడు హరీష్ రావు ఇమేజ్ ను పెంచిందని కేడర్ చర్చించుకుంటోంది. హరీష్ రావు మౌనంగా ఉన్నా, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, కొద్దిమంది మత్రులతో సహా ఆయన అభిమానులలో, కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహం నాయకులలో బహిరంగంగ వ్యక్తం కాకపోయినా, ప్రజలు, కార్యకర్తల్లో భగ్గుమంటోందని తెలుస్తోంది. ఇదెలా ఉన్నా, ప్రస్తుతం .. ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో మళ్లీ హరీష్ రావు .. తెరపైకి రావడంపై కేడర్ లో పలు చర్చలు సాగుతున్నాయి. ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడానికి కేటీఆర్ సరిపోరని, అందుకే మళ్లీ హరీష్ రావును తెచ్చారని టాక్ నడుస్తోంది.

CM KCR Check to Hrish rao

CM KCR Check to Hrish rao

Harish Rao ఉప ఎన్నిక ముగిసిన వెంటనే…

అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హరీష్ రావులో వచ్చిన మార్పు, ఇమేజ్ పై ప్రభావం చూపిస్తోందని కేడర్ చర్చించుకుంటున్నారు. తన పదవిని కాపాడుకోవడం కోసమే హరీష్ రావు ఈటెల రాజేందర్ పై పోరాడడానికి దిగారని వీరంతా అంటున్నారు. దీనికి తోడు గతంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు అభ్యంతరం లేదని, కేటీఆర్ కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేయడానికి సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు.

Etela Rajender

Etela Rajender

దీంతో జనాల్లో హరీష్ రావు ఇమేజ్ మసకబారుతోందని కేడర్ భావిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కు హరీష్ రావు అవసరం వచ్చిందని, అందుకే హరీష్ రావుకే వైద్య ఆరోగ్య శాఖ అప్పజెప్పారని, రెండు కేబినెట్ సబ్ కమిటీలతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక భారాన్ని అప్పజెప్పారని చెబుతున్నారు. అయితే హరీష్ రావును దగ్గరకు తీస్కోవడం వెనుక మళ్లీ అదును చూసి దెబ్బ వేసేందుకేనని కేడర్ అంటోంది.. ఈ నేపధ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అరగంటలో … ఈటల రాజేందర్ ఉద్వాసన ముందు సీన్లు ..రిపీట్ అవుతాయా? అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది