TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..?

 Authored By sukanya | The Telugu News | Updated on :11 July 2021,7:00 am

TRS తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ TRS పార్టీ గ‌త ఏడేళ్లుగా ఎంతో మందిని పార్టీలో చేర్చేసుకుంటోంది. పార్టీలోకి వ‌చ్చాక కొద్ది నెల‌ల పాటు వీరిని అందలం ఎక్కించ‌డం.. ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌న పెట్టేయ‌డం కూడా గులాబీ పార్టీలో కామ‌న్ అయిపోయింది. జూనియ‌ర్ల నుంచి త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు ఎంతో మంది ఇప్పుడు త‌మ బాధ ఎవ్వ‌రికీ చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఒక‌ప్పుడు టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌లుగా ఉన్న సీనియ‌ర్లు ఇప్పుడు క‌నీసం త‌మ గ్రామ‌స్థాయిలో కూడా చ‌క్రం తిప్ప‌లేక చ‌తికిల‌ప‌డుతున్నారు. టీఆర్ఎస్ తొలి ప్ర‌భుత్వంలో ఓ వెలుగు వెలిగిన వారిలో తుమ్మ‌ల‌, క‌డియం, పొంగులేటి, జూప‌ల్లి ఉన్నారు. కానీ ఇప్పుడు వారు క‌నీసం వార్త‌ల్లో కూడా ఉండ‌డం లేదు. అస‌లు పార్టీలో ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుందా ? ఏం చేయాల‌న్న స‌మాలోచ‌న‌ల్లో ఉన్నారు.

TRS

TRS

TRS అసంతృప్తిలో మాజీలు

మాజీ మంత్రి తుమ్మ‌ల‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందే బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే అప్పుడు వీరిద్ద‌రి అసంతృప్తిని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ వీరికి కొన్ని హామీలు ఇచ్చి సైలెంట్ చేశారు. అయితే ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి రావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ‌పు రోజులు వ‌స్తాయ‌ని అంటున్నారు. కాంగ్రెస్‌లో పాత జోష్ క‌నిపిస్తోంది. బీజేపీలోకి వెళ్లాల‌నుకుంటోన్నవారు, టీఆర్ఎస్ అసంతృప్త వాదులు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. లిస్టులో ఉన్న కారు పార్టీ అసంతృప్త నేత‌లు కూడా ఇప్పుడు కాచుకుని ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు భ‌ర్తీ కానున్నాయి. వీటిల్లో త‌మ‌కు ఛాన్స్ వ‌స్తే స‌రి.. లేక‌పోతే ఈ ఎమ్మెల్సీల ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఈ నేత‌లంతా త‌మ‌దారి తాము చూసుకునేందుకు రెడీగానే ఉన్నార‌ని తెలుస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది