Revanth Reddy : పీసీసీ చీఫ్ అయిన కొన్ని రోజులకే టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : పీసీసీ చీఫ్ అయిన కొన్ని రోజులకే టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి?

Revanth Reddy తెలంగాణ Telangana లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి Revanth reddy . గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతల మద్దతు కోరుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని క్రియాశీల పోరాటాల వైపు మరల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరిపిన దళిత, గిరిజన […]

 Authored By sukanya | The Telugu News | Updated on :20 August 2021,6:30 am

Revanth Reddy తెలంగాణ Telangana లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి Revanth reddy . గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతల మద్దతు కోరుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని క్రియాశీల పోరాటాల వైపు మరల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరిపిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.

ఈ క్రమంలోనే ఓ వైపు టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే మరో వైపున బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు, రైతుల స‌మ‌స్య‌ల‌పై వ‌రుస నిర‌స‌న‌లకు ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి దళిత బంధుకు కౌంటర్ అటాక్‌గా దళిత‌, గిరిజ‌న ఆత్మగౌరవ దండోరా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు సభలు విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి దూకుడు షురూ అయిందన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Revanth Reddy Speech In Dalit Girijana Dandora Sabha

Revanth Reddy Speech In Dalit Girijana Dandora Sabha


మెదక్ లో ..  Revanth Reddy

ఇంద్రవెల్లి సభ ఫుల్ సక్సెస్ కాగా, రెండో సభ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధిష్టానం. అయితే, అనూహ్య మార్పులతో రావిర్యాలలో రెండో సభ జరిగింది. ఇక అప్పుడే మూడో సభ గురించి రేవంత్ ఆలోచించారని సమాచారం. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సభ ఉండేలా ప్లాన్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ నెల 24న నిర్వహించాలని, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సభ నిర్వహించడం ద్వారా ఓ వైపు కేసీఆర్, టీఆర్ఎస్‌ను, మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను కూడా టార్గెట్ చేసినట్లవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ టీఆర్ఎస్, బీజేపీ రెండిటినీ టార్గెట్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే జోష్ మీదున్న కాంగ్రెస్ .. మరింత జోష్ లోకి వస్తుందని, ఇదే ఊపు కొనసాగిస్తే, వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

kcr

kcr

ప్రవీణ్ కుమార్ ప్రస్తావన.. Revanth Reddy

అదే సమయంలో రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించారు. అందులో భాగంగా ఇటీవల తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

RS praveen kumar Clarity on Political Entry

RS praveen kumar Clarity on Political Entry

మరో ఆరేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉండి.. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ప్రవీణ్ కుమార్ వివక్షను తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌ సైతం టీఆర్ఎస్ పైనే ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పై ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ప్రవీణ్ కుమార్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడమో లేక బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆయనతో కలిసి పని చేయడమో చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి ఆయన పట్ల సానుకూలంగా స్పందించి ఉంటారని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది