Revanth Reddy – Malla Reddy : తెలంగాణలో ‘రెడ్డి’ కుంపటి… మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి
Revanth Reddy – Malla Reddy : రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం అది. ఆ సామాజిక వర్గ పెద్దలంతా కలిసి, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి మల్లారెడ్డి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు పాల్గొని, తమ అభిప్రాయాల్ని ఈ వేదిక ద్వారా కుండబద్దలుగొట్టారు.. సామాజిక వర్గ అభివృద్ధి విషయమై కొన్ని సూచనలూ చేశారు. అయితే, మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ఆందోళన చేశారు. రెడ్డి కార్పరేషన్‌కి 5 వేల కోట్లు కేటాయించాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయ్యింది.
ఆ విషయమై మంత్రి మల్లారెడ్డి నుంచి సరైన స్పష్టత రాలేదనీ, కేవలం రాజకీయ ప్రసంగంతోనే ఆయన సరిపెట్టారనీ ఆ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, వ్యక్తులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డిపై దాడికి యత్నించారు కొందరు. పోలీసులు సకాలంలో స్పందించారు.. అదే సమయంలో, నిర్వాహకులూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మొత్తానికి మల్లారెడ్డి ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లోనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మల్లారెడ్డి కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి రేవంత్ రెడ్డి కారణమనీ, ఆయన్ని జైల్లో పెట్టిస్తాననీ మంత్రి మల్లారెడ్డి తాజాగా శపథం చేసేశారు.
అయితే, ఈ కార్యక్రమానికీ రేవంత్ రెడ్డికీ ప్రత్యేకంగా ఎలాంటి సంబంధం లేదనీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకుల్లానే రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చారనీ, సామాజిక వర్గ ప్రముఖులు, నిర్వాహకులు అంటున్నారు. తెలంగాణలో రెడ్ల మధ్య నడుస్తున్న ఈ పంచాయితీ, రాజకీయంగా కాక రేపింది. దీన్ని ఓ సామాజిక వర్గంలో ఆధిపత్య పోరులా కాకుండా, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయితీగానూ చూసే ప్రయత్నం జరుగుతోంది. మరోపక్క, రెడ్లను దొరలు తొక్కేస్తున్నారంటూ రెడ్డి సామాజిక వర్గంలో కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కుల పంచాయితీలు ఎక్కువ. అవి తెలంగాణకీ పాకినట్టున్నాయ్