తెరాస మంత్రి MallaReddy వ్యవహారం గురించి అందరికి తెలుసు.. ఆయనకు ఆవేశం వస్తే ఏమి మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలియదని చాలా మంది సరదాగా అంటుంటారు. అలాంటి మనిషి ఏకంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లాంటి నేతతో లైవ్ లో వాదనకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి.
నిన్న ఒక ప్రముఖ ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో రేవంత్ రెడ్డి పాల్గొని మల్లారెడ్డి మీద అతని అల్లుడి మీద, అతని బావమరిది మీద ఆరోపణలు చేయటమే కాకుండా ఎవరి మీద ఎంతెంత భూములు ఉన్నాయో.. దేవస్థానాల భూముల్లో ఫామ్ హౌస్ లు కట్టుకొని తిరుగుతున్నారని, మల్లారెడ్డి కాలేజీలు కు కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ విమర్శలు చేశాడు .
ఇవన్నీ మల్లారెడ్డి చూశాడో, లేకపోతె అనుచరులు చెప్పారో కానీ, స్టూడియో వాళ్ళు అడగకుండానే ఫోన్ లైన్ లోకి వచ్చాడు మల్లారెడ్డి. వచ్చి రావటంతోనే రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతూ, నువ్వు మాగోడివి అయితే అవి రుజువు చేయి, నాకు ఏడూ ఎకరాలు అన్నావు కదా..? దమ్ముంటే నిరూపించు..? అవే నిజమైతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. అవి అబద్దం అయితే నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరాడు..
ఈ క్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఫామ్ హౌస్ లాంటివి మాకేమి లేదు.. మా అల్లుడు మా బావమరిదికి కూడా అవేమి లేవంటూ చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి వదిలిపెట్టకుండా అటు తిప్పి ఇటు తిప్పి సర్వే నంబర్లు, భూమి వివరాలు అన్ని చెపుతూ మల్లారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాడు.. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మల్లారెడ్డి అవునండి అక్కడ ఫామ్ హౌస్ ఉంది, అది మా బావమరిదిది, నాది కాదు దానితో నాకు సంబంధం లేదని చెప్పాడు. ముందు అసలు అక్కడ ఫామ్ హౌస్ లేదు దమ్ముంటే చూపించమని చెప్పిన మల్లారెడ్డి కాసేపటికి ఫామ్ హౌస్ ఉంది కానీ నాది కాదంటూ అసలీ గుట్టు చెప్పాడు.
ఇక్కడ విశేషం ఏమిటంటే మల్లారెడ్డి బావ మరిది కూడా తెరాస లోని కీలక నాయకుడే, పైగా ఆ ఫామ్ హౌస్ దేవాదాయ శాఖకు చెందిన భూమిలో అక్రమంగా కట్టారు.. ఈ కోణంలో చూసుకున్న అది ముమ్మాటికీ తప్పు కిందకే వస్తుంది. మా బావమరిదిది నాకేమి సంబంధం లేదని మల్లారెడ్డి బుకాయించిన కానీ లాభం లేదు. ఎందుకంటే ఎవరు ఏమిటో జనాలకు బాగానే తెలుసు.. అయిన సరిగ్గా వాదన చేయటం చేతకాకపోతే సైలెంట్ గా ఉంటే బాగుంటుంది కానీ, ఇలా లైవ్ లోకి వచ్చి పరువు తీసుకోవటం అవసరమా అనే కామెంట్స్ నెటిజన్ల నుండి వినిపిస్తున్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.