Revanth Reddy : వైఎస్సార్ ను మించిపోయిన రేవంత్ రెడ్డి? ఆవిషయంలో రేవంత్ గ్రేట్ అనిపించుకున్నారు?
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటేనే దానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరింపజేశారు. పార్టీని బలపరిచారు. ఆయన ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు నడిచాయి. పార్టీ వరుసగా అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో.. పార్టీని తన భుజాల మీద మోశారు వైఎస్సార్. అందుకే.. ఆయనకు ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడతారు. ఆయన భౌతికంగా లేకున్నా.. ఆయన్ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటారు. దానికి కారణం ఆయన రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులు.
కేంద్రంలో.. కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించి మరీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు వైఎస్సార్. వైఎస్సార్ అంటే కేంద్రంలో కూడా ఒకరకమైన అభిమానం ఉండేది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే అవకాశం వైఎస్సార్ కు దక్కింది. అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో.. ప్రజల విశ్వాసాన్ని చురగొనడంలో వైఎస్సార్ సఫలం అయ్యారు.
కానీ.. ఆయన అకాల మరణం చెందడం.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం.. రాష్ట్రం ముక్కలు అవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయింది. తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు కూడా లేవు.
Revanth Reddy : మరో వైఎస్సార్ లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుతున్న రేవంత్ రెడ్డి
అయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరో వైఎస్సార్ దొరికారు. ఆయనే రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి.. మల్కాజ్ గిరి ఎంపీ అవడంతో పాటు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. నామరూపం లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సరైన నాయకత్వం కోసం వేచి చూస్తున్న హైకమాండ్ కు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి దొరికారు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడే కావాలని కోరుకున్నారు. అనుకున్న నాయకుడు.. తెలంగాణలో దొరకడంతో.. రేవంత్ రెడ్డికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారట. అందుకే రేవంత్ రెడ్డి ఇటీవల వరుసగా.. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో భేటీ అవుతూ.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. మొత్తానికి తెలంగాణకు మరో వైఎస్సార్ దొరికినట్టే.