Revanth Reddy : అది రేవంత్ అంటే.. దెబ్బకు టీఆర్ఎస్, బీజేపీ కుదేల్.. ఈ ప్లాన్ సక్సెస్ అయితే హుజూరాబాద్ గెలుపు కాంగ్రెస్ దే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : అది రేవంత్ అంటే.. దెబ్బకు టీఆర్ఎస్, బీజేపీ కుదేల్.. ఈ ప్లాన్ సక్సెస్ అయితే హుజూరాబాద్ గెలుపు కాంగ్రెస్ దే?

 Authored By sukanya | The Telugu News | Updated on :2 October 2021,11:40 am

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించిన మాజీమంత్రి కొండా సురేఖ ఇందుకు నో చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈ విషయాన్ని నిన్ననే స్పష్టం చేశారు. పోటీపై ఏదో ఒక నిర్ణయం చెప్పాలని టీపీసీసీ కొండా సురేఖకు డెడ్ లైన్ విధించింది. అయితే తన షరతులపై టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె హుజూరాబాద్‌లో పోటీ చేయడంపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టిన టీపీసీసీ…

Revanth redy big plan on TRS and BJP

Revanth redy big plan on TRS and BJP

తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నాయకుడు బలుమూరి వెంకట్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపడంతో.. తాము కూడా విద్యార్థి నాయకుడైన వెంకట్‌ను బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల పాటు విద్యార్థుల సమస్యలపైనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తెలంగాణ కాంగ్రెస్.. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో విద్యార్థి నాయకుడిని బరిలోకి దింపితే బాగుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Revanth Reddy  బలమైన పోటీ ఇచ్చేందుకే..

వెంకట్ గతంలో పెద్దపల్లి సీటు ఆశించారని.. తాజాగా పెద్దపల్లి పక్కనే ఉండే హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆయనను కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హుజూరాబాద్ బరిలో పత్తి కృష్ణారెడ్డితో పాటు ఇతర పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలించిందని.. ఈ క్రమంలోనే కొత్తగా వెంకట్ పేరు తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్, బీజేపీలకు బలమైన పోటీ ఇవ్వాలని అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే బాగుంటుందని, అందుకే కొండా సురేఖను బరిలోకి దింపేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించింది.

motkupalli narasimhulu May be joine in TRS

motkupalli narasimhulu May be joine in TRS

కానీ.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు ఎవరో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చింది. ఇందుకు పలువురి పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకత్వం.. వారిలో బలుమూరి వెంకట్ పేరును సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈసారి హుజూరాబాద్ బరిలో నిలవబోయే కాంగ్రెస్ అభ్యర్థిని.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేసేలా ఉండాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది