RGV : కొడాలి నానిని సపోర్ట్ చేస్తూనే ఆయనపై సెటైర్స్ వేసిన రామ్‌గోపాల్ వర్మ
RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసే కామెంట్స్ ఎంత సెన్సేషనల్‌గా మారుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న వర్మ.. మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. గుడివాడలో గోవా కల్చర్‌ను తీసుకురావడంపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. గుడివాడను లండన్, పారిస్, లాస్‌వెగాస్‌ల సరసన నిలిపారని గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను మంత్రి కొడాలి నాని కల్పించారంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
సంక్రాంతి సంబరాల సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.ఏపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం, ఆయన సొంతూరు గుడివాడలో ఈ సంక్రాంతికి క్యాసినో క్లబ్బులు నిర్వహించారు. గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో పేకాట శిబిరాలు, గుండాటలతో పాటు క్యాసినో కూడా నిర్వహించారు.క్యాసినో ఎంట్రీ కోసం ఏకంగా 10 వేల రూపాయలు చెల్లించాలి. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు.
RGV : వర్మ కామెంట్స్ వెనక అర్ధమేంటి?
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో ఇవి వివాదాస్పదం అయ్యాయి. ఏపీలో క్యాసినో చట్ట విరుద్ధం కావడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వర్మ.. గుడివాడ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిన కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. క్యాసినో కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళంతా పూర్వీకులని, వారికి ఏమీ తెలియదని రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. వారంతా చరిత్రపూర్వ చీకటి యుగాలకు ప్రగతిని లాగుతున్న వారని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు. అంతేకాదు గుడివాడలో క్యాసినో నిర్వహించడాన్ని చిన్నచూపు చూస్తున్న వారంతా గోవా, లాస్ వెగాస్ లాంటి మెగా నగరాలను తక్కువ చేయడమేనని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
My question to people looking down upon @IamKodaliNani initiated casino is “is anyone looking down upon Goa and Las Vegas ?
— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022