RGV : నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతిష్టమో.. ఆయనతో సినిమా మాత్రం తీయలేను..ఆర్జీవి

Authored By vamana sai | The Telugu News | Updated on: April 16, 2021, 8:40 am

RGV : సెన్షేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటే పరిచయం ఏమాత్రం అవసరం లేదు. అంతగా ఆయన పాపులర్ అయ్యాడు. కేవలం సినిమాలతోనే కాదు వివాదాలతోను తన స్టైల్ మరొకరికి ఉండదు.. రాదు. ఎప్పుడు ఎవరిని తిడతాడో..ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఎవరూ ఊహించలేరు. ఆర్జీవి అంటే సంచలన దర్శకుడు..కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తాడు. ఇది మాత్రం ప్రతీ ఒక్కరు చెప్పగలరు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఓవర్ నైట్ స్టార్ చేసే కెపాసిటి ఒక్క ఆర్జీవికి మాత్రమే ఉంది.

కాగా ఆర్జీవికి బాగా అలవాటైన..ఇష్టమైన హర్రర్ జోనర్‌లో తాజాగా ఒక సినిమా తీశాడు. ఆ సినిమానే ఆర్జీవి దెయ్యం. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ హీరోగా నటించడం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై జనాలని బాగానే ఆకట్టుకుంది. ఆర్జీవి మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవి .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అందరి నోట వినిపిస్తూ వైరలవుతున్నాయి.

rgv-likes pawan kalyan

rgv-likes pawan kalyan

RGV : ఆర్జీవి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్‌గా స్పందించడం విశేషం.

పవన్ కళ్యాణ్ అంటే ఆర్జీవికి వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవీ చూడలేదని.. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ అయిన వకీల్ సాబ్ సినిమా కూడా చూడలేదని తెలిపాడు. అయితే వకీల్ సాబ్ ట్రైలర్ మాత్రం చూసినట్టు ..ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చిందని చెప్పడమే కాదు ఇలాంటి సినిమాలు నేను పవన్ కళ్యాణ్‌తో తీయలేనని క్లారిటీ ఇచ్చాడు. కమర్షియల్ సినిమాలను పవన్ కళ్యాణ్‌తో తీయడం రాదన్న ఆర్జీవీ..జోనర్ సినిమాలను మాత్రమే తీయగలనని వెల్లడించాడు. అయితే చాలా కాలం తర్వాత ఆర్జీవి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్‌గా స్పందించడం విశేషం.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp