Roja : నటిగా, ఎమ్మేల్యేగా, మంత్రిగా రోజా గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్న రోజా ప్రస్తుతం రాజకీయాలలో ఉండడంతో పలువురి నుండి విమర్శలు పొందుతుంది. రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా ఆడి పాడి అలరించిన ఈ బ్యూటీ..రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంది. అప్పట్లో రోజా సినిమాలు వస్తున్నాయి అంటే ధియేటర్స్ దగ్గర రచ్చ మాములుగా ఉండదు. టాలీవుడ్ కి బడా బడా బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించింది రోజా.
ఇక పెళ్లి తర్వాత సినిమాలు కాస్త తగ్గించిన రోజా సుధీర్ఘకాలం జబర్థస్త్ జడ్జిగా వ్యవహరించింది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా జబర్థస్త్ ను వీడలేదు. చివరకు తనతో పాటు ఉన్న కోస్టార్ నాగబాబు వెళ్లిపోయినా.. రోజా మాత్రం జబర్థస్త్ ను వీడలేదు. దాదాపు 10 ఏళ్లు జబర్థస్త్ జడ్జిగా లక్షల్లో రెమ్యూనరేష్ తీసుకుంది రోజా.ఇటీవల తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు ‘రుషికొండ గిఫ్ట్’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారని ఆమె అన్నారు.
అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు. ఈ రకంగా జబర్థస్త్ ద్వారా రోజా ఎంత వెనకేసుకున్నారో అని నెటిజన్లు చెవులు కొరుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.