Pension : భార్యభర్తల కోసం నెలకు రూ.10వేల పెన్షన్ స్కీమ్.. త్వరపడండి!
pension : సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాల పథకాలను ప్రజల మేలు కోసం తీసుకొచ్చింది. వీటి సవ్యంగా ఉపయోగించుకుంటే ఎన్నో విధాలుగా లబ్ది చేకూరుతుంది. కేంద్రం తీసుకొచ్చిన వాటిలో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. రైతుల నుంచి చిరు వ్యాపారుల వరకు అనుగుణంగా పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందవచ్చును. వయసు మీద పడ్డాక […]
pension : సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాల పథకాలను ప్రజల మేలు కోసం తీసుకొచ్చింది. వీటి సవ్యంగా ఉపయోగించుకుంటే ఎన్నో విధాలుగా లబ్ది చేకూరుతుంది. కేంద్రం తీసుకొచ్చిన వాటిలో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. రైతుల నుంచి చిరు వ్యాపారుల వరకు అనుగుణంగా పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందవచ్చును. వయసు మీద పడ్డాక కుటుంబ సభ్యులు చూస్తారా? లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పని అస్సలే లేదు. కానీ ఈ పథకంలో చేరిన వారు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించాలి.
దీని ప్రకారం నెలనెలా వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. అసంఘటిత రంగంలో పని చేసే వారు కూడా అర్హులే. ఈ పథకంలో చేరాలంటే బ్యాంక్ ఖాతా ఉండాలి. ఆధార్ కార్డు అవసరం. ఆన్‌లైన్‌లోనే అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరొచ్చు. దీని కోసం NPS వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 42 కట్టాలి. వీరికి రూ.1000 పెన్షన్ వస్తుంది. అదే నెలకు రూ.210 చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత అనగా 60 ఏళ్లకు నెలకు రూ.5 వేల పెన్షన్ తీసుకోవచ్చు. వయసు పెరిగే కొద్ది చెల్లించే ప్రీమియం కూడా పెరుగుతూ వెళ్తుంది.
Pension : భార్యభార్తలకు బెనిఫిట్ స్కీం
అనగా 40 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే అప్పుడు రూ.1000 పెన్షన్ కోసం నెలకు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. అదే నెలకు రూ.5 వేలు కావాలంటే మాత్రం నెలకు రూ.1454 కడుతూ వెళ్లాలి. అంటే వయసు పెరిగే కొద్ది చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్ పొందొచ్చని తెలుస్తోంది. భార్యభర్తల వయసు 25 ఏళ్లు లేదా తక్కువ ఉంటే అప్పుడు నెలకు రూ.752 చెల్లిస్తే చాలు. 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా దంపతులు రూ.10 వేల పెన్షన్ పొందవచ్చును. ఇంకెందుకు ఆలస్యం మరీ త్వరపడండి..