Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  తెలంగాణ లో ఫేసియల్‌ రికగ్నిషన్‌ విధానంలో చేయూత పింఛన్లు

  •  Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నిషన్) విధానాన్ని ప్రవేశపెడుతూ, తొలిదశలో 23 లక్షల మందికి ఇది అమలు చేయనుంది. ముఖ్యంగా తపాలా శాఖ ద్వారా పింఛన్లు పొందే వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు, బీడీ, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులకు ఈ విధానం వర్తించనుంది. వృద్ధుల వేళ్ల రేఖలు తొలిపోతుండటంతో బయోమెట్రిక్ పద్ధతి పనిచేయకపోవడం వల్ల కొంతమంది వారి పింఛన్ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ఫేసియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది.

Pension గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : తెలంగాణలో ఫేసియల్ రికగ్నిషన్ విధానంలో పింఛన్ పంపిణీ ప్రారంభం

ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి టీజీ ఆన్‌లైన్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. పోస్టుమాష్టర్లు, పోస్టుమ్యాన్‌లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఫోటోను ఆధార్‌లోని ఫోటోతో సరిపోల్చి గుర్తింపు నిర్ధారించిన అనంతరం, పింఛన్ చెల్లింపులు జరుపుతారు. ఫొటో ద్వారా గుర్తింపు సాధ్యపడని వారికి బయోమెట్రిక్ ద్వారా పింఛన్ ఇస్తారు.

రెండు పద్ధతులు ఫలించనప్పుడు, గ్రామ కార్యదర్శుల ధృవీకరణతోనే పింఛన్ అందిస్తారు. అయితే కొత్త విధానం అమలుతో కొన్నిచోట్ల అధికారులు ఆధార్‌తో పాటు ఓటర్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి తప్పనిసరిగా కోరుతుండటం వల్ల పలువురు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వయసును నిరూపించేందుకు ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుండగా, ఇప్పుడు అధిక డాక్యుమెంట్లు కావాలనడం తిరకాసు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తాజా పరిష్కార మార్గం ఎంతోమందికి మేలు చేయనుందన్న ఆశలు ఉన్నా, అమలులో పారదర్శకత, సహకారం లేకపోతే దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది