Home » News » Rs 5 Breakfast Scheme Will Be Launched In Hyderabad Very Soon
News

Hyderabad Breakfast Scheme | రోజుకి 25వేల మందికి రూ.5 బ్రేక్ ఫాస్ట్.. ఎప్ప‌టి నుండి ప్రారంభం కానుంది అంటే..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 15, 2025, 4:00 pm
Advertisement

Hyderabad Breakfast Scheme | హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభిస్తారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఈ స్టాల్స్ ఉండగా.. వీటి సంఖ్యను 150కు పెంచారు. చాలా ఏళ్లుగా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో కొన్ని డ్యామేజ్ అయ్యాయి.

Advertisement

#image_title

వీలైనంత త్వ‌ర‌గా..

Advertisement

మరికొన్నిచోట్ల పూర్తిగా పాడై వినియోగించేందుకు వీలులేకుండా పోవ‌డంతో వీటి స్థానంలో రూ.11.43 కోట్లతో బల్దియా కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేయగా.. గతంలో ఉన్న సైజుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ స్పేస్ తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. హరేరామ హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి ప్రభుత్వం రూ.5కే నాణ్యమైన, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తుంది.

ఒక్క బ్రేక్ ఫాస్ట్ కు రూ. 19 ఖర్చు అవుతుండగా.. ఇందులో రూ.5 ప్రజల నుంచి తీసుకుంటారు. ఇక జీహెచ్ఎంసీ రూ.14 భరించనుంది. ఈ పథకాన్ని ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో అందుబాటులోకి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ రానుంది. ఈ స్కీంలో భాగంగా ఒక్కో రోజు ఒక వెరైటీ టిఫిన్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి