
RS Praveen Kumar comments on TRS Party
RS Praveen Kumar గురుకులాల మాజీ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar రాజకీయ జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే బీఎస్పీలో చేరతారని యూపికి చెందిన బహుజన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
RS Praveen Kumar comments on TRS Party
దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar రాజకీయ అరంగ్రేటానికి సన్నద్దమయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే రాజీనామా సమర్పించారని సమాచారం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar చేరికపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగంను రక్షించడం కోసం అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. RS ప్రవీణ్ కుమార్ ఈ నెల 8న బహుజన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అవుతున్నారని ప్రకటించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక కోసం నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. BSP జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ MP రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత ముందుగా TRSలో చేరతారని సోషల్ మీడియాలో భారీ ప్రచారం సాగింది. SCలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో TRS పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపించింది.
RS Praveen Kumar comments on TRS Party
అయితే వీటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎండ్ కార్డ్ వేశారు. తాను ముందుగా రాజకీయాల్లో రానని ప్రకటించినా, అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు. తనకు విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. MLA కావాలనో.. మంత్రి కావాలనో చేరడం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేవలం గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ మార్చేందుకు రాజకీపార్టీలో చేరుతున్నట్లుగా వివరణ ఇచ్చుకున్నారు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.