గులాబీ తెలంగాణను నీలి తెలంగాణగా మార్చేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

గులాబీ తెలంగాణను నీలి తెలంగాణగా మార్చేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar గురుకులాల మాజీ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar రాజకీయ జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే బీఎస్పీలో చేరతారని […]

 Authored By sukanya | The Telugu News | Updated on :7 August 2021,9:00 pm

RS Praveen Kumar గురుకులాల మాజీ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar రాజకీయ జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే బీఎస్పీలో చేరతారని యూపికి చెందిన బహుజన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

RS Praveen Kumar comments on TRS Party

RS Praveen Kumar comments on TRS Party

దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar  రాజకీయ అరంగ్రేటానికి సన్నద్దమయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే రాజీనామా సమర్పించారని సమాచారం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar చేరికపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగంను రక్షించడం కోసం అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. RS ప్రవీణ్ కుమార్ ఈ నెల 8న బహుజన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అవుతున్నారని ప్రకటించారు.

నీలి తెలంగాణ కోసమే.. RS Praveen Kumar

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక కోసం నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. BSP జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ MP రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత ముందుగా TRSలో చేరతారని సోషల్ మీడియాలో భారీ ప్రచారం సాగింది. SCలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో TRS పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపించింది.

RS Praveen Kumar comments on TRS Party

RS Praveen Kumar comments on TRS Party

అయితే వీటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎండ్ కార్డ్ వేశారు. తాను ముందుగా రాజకీయాల్లో రానని ప్రకటించినా, అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు. తనకు విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. MLA కావాలనో.. మంత్రి కావాలనో చేరడం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేవలం గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ మార్చేందుకు రాజకీపార్టీలో చేరుతున్నట్లుగా వివరణ ఇచ్చుకున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది