Home » Exclusive » Russian Soldiers Calling Ukrainian Women To Meet
Exclusive

Ukrainian : ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్.. స‌ర‌సాల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసిన మ‌హిళ‌

Authored By
Sam C
The Telugu News | Published on: February 24, 2022, 5:30 pm
Advertisement

Ukrainian : మొన్న‌టి వ‌రకు కరోనాతో స‌త‌మ‌తం చెందిన ప్ర‌పంచ దేశాలు ఇప్పుడు యుద్ధం వ‌ల‌న ఆందోళ‌న చెందుతున్నాయి. ఉక్రెయిన్..ర‌ష్యాల మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రుగుతోన్న వేళ‌..ఉక్రెయిన్ మ‌హిళ‌ల‌కి ర‌ష్యా సైనికులు పంపుతోన్న రొమాంటిక్ మెసేజ్ వైర‌ల్ గా మారాయి. ఇంత‌టి యుద్ధ‌స‌మ‌యంలో వారు మ‌హిళ‌ల‌కి అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్ లు పంప‌డం గ‌మ‌నార్హం.టిండర్‌లో రష్యా సైనికులు తన రొమాంటిక్ మెసేజ్ లు పంపుతున్నారని ఒక ఉక్రేనియన్ మహిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అనేక మంది రష్యన్ సైనికులు తమ ఫోటోలతో పాటు, తమ స్థానాల సమాచారాన్ని మహిళలకు పంపినట్లు తెలిపింది. ది సన్ నివేదిక ప్రకారం, ఆండ్రీ, అలెగ్జాండర్, గ్రెగొరీ , మైఖేల్‌తో సహా అనేక మంది రష్యన్ సైనికులు ఉక్రేనియన్ మహిళలను ఆకర్షించడానికి డేటింగ్ యాప్‌లో తమ ప్రొఫైల్‌లను సృష్టించారు.

Advertisement

గత కొన్ని రోజులుగా టిండెర్‌లో పలువురు రష్యా సైనికులు తనకు మెసేజ్‌లు, అభ్యర్థనలు పంపుతున్నారని దశా సినెల్నికోవా అనే ఉక్రెయిన్ మహిళ తెలిపింది. నేను ఉక్రెయిన్‌లోని కైవ్‌లో నివసిస్తున్నాను, కానీ చాలా మంది రష్యన్ సైనికులు టిండెర్‌కు చేరుకున్నారని ఒక స్నేహితుడు నాకు చెప్పాడు, కాబట్టి నేను నా లొకేషన్ సెట్టింగ్‌ని ఖార్కివ్‌కి మార్చాను. అక్కడ కూడా నాకు మెసేజ్ లు రావడం ప్రారంభించాయి. ఆమెకి పంపిన ఫొటోలో .. రష్యన్ సైనికుడు చారల చొక్కాలో కనిపించాడు. మరొక ఫొటోలో , వ్యక్తి తన పిస్టల్‌తో మంచం మీద పడుకున్నాడు. నేను శత్రువుతో మాట్లాడటం గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను టిండెర్‌లో వారి అభ్యర్థనను తిరస్కరించాను, కానీ చాలా మంది వ్యక్తులు నిరంతరం సందేశాలను పంపుతున్నార‌ని ర‌ష్య‌న్ సైనికుల గుట్టు ర‌ట్టు చేసింది.ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టింది రష్యా సైనం. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది.

russian soldiers calling ukrainian women to meet

Advertisement

Ukrainian : ఆ మ‌హిళ కామెంట్స్ వెన‌క అర్ధ‌మేంటి?

మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌ కేపిటల్‌ కీవ్‌ను ఆక్రమించింది రష్యా. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను ముట్టడించింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి మూకుమ్మడి దాడికి దిగాయి.ఉక్రెయిన్‌సై సైనిక చర్యకు దిగిన పుతిన్, అమెరికా అండ్ నాటో కంట్రీస్‌కు డైరెక్ట్ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం ప్రతీకారం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. చరిత్రలో మీరు చూసిన పరిణామాలకు మిమ్మల్ని దారితీస్తుందని.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో మా ప్రణాళికలు ప్రత్యేక సైనిక చర్యలో ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి