
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు Telangana farmers ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్ Yasangi season ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయోనని గ్రామాలన్నింటిలో ఒకే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా విడుదలపై ఆశలు పెట్టుకున్నా జనవరిలో జమ కావాల్సిన సొమ్ము వివిధ కారణాలతో నిలిచిపోయింది. దీంతో సాగుకు కావాల్సిన పెట్టుబడి కోసం farmers రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా ఇంకొందరు అగ్రికల్చర్ లోన్లపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం Central government రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం pm kisan yojana కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తవడంతో ఇక నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా 22వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు పంపించనున్నారని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ కారణంగా ఆలస్యం అయిన ఈ చెల్లింపులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.
కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా Rythu Bharosa నిధుల జమకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రైతు భరోసా సొమ్ము శాటిలైట్ సర్వే కారణంగా ఆలస్యమైంది. సాగులో ఉన్న భూముల గుర్తింపుకు చేపట్టిన ఈ సర్వే ఇటీవల పూర్తవ్వగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు జరగడం లేదని వెల్లడైంది. ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా అర్హులైన రైతులకు మాత్రం ఫిబ్రవరి చివరికల్లా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా జమ చేయనున్నారు. ఇలా పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు దాదాపు ఒకేసారి రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉండటంతో ఈ నెల రైతులకు ‘డబుల్ బొనాంజా’గా మారనుంది. కేంద్రం నుంచి రూ.2 వేలు రాష్ట్రం నుంచి ఎకరానికి రూ.6 వేలు అందడంతో రైతులకు కొంత ఊరట కలగనుంది. పెట్టుబడి భారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు సాగుకు మళ్లీ ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ఫిబ్రవరి చివరి వారంలో నిజంగానే ఈ నిధులు ఖాతాల్లో పడతాయా? అన్నదానిపైనే.
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
This website uses cookies.