Rythu Bharosa : రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !

 Authored By suma | The Telugu News | Updated on :4 February 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : తెలంగాణ రైతులకు ఊరట .. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా ..అకౌంట్లోకి డబ్బులు జమ అప్పుడే ..!

Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు  Telangana farmers  ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్ Yasangi season  ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయోనని గ్రామాలన్నింటిలో ఒకే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా విడుదలపై ఆశలు పెట్టుకున్నా జనవరిలో జమ కావాల్సిన సొమ్ము వివిధ కారణాలతో నిలిచిపోయింది. దీంతో సాగుకు కావాల్సిన పెట్టుబడి కోసం farmers  రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా ఇంకొందరు అగ్రికల్చర్ లోన్లపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Rythu Bharosa : రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !

Rythu Bharosa : రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !

Rythu Bharosa : పీఎం కిసాన్ నిధుల విడుదలకు సిద్ధమైన కేంద్రం

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం  Central government  రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం pm kisan yojana  కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తవడంతో ఇక నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా 22వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు పంపించనున్నారని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ కారణంగా ఆలస్యం అయిన ఈ చెల్లింపులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.

Rythu Bharosa : ఫిబ్రవరి చివర్‌లో రైతులకు ‘డబుల్ బొనాంజా’

కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా  Rythu Bharosa నిధుల జమకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రైతు భరోసా సొమ్ము శాటిలైట్ సర్వే కారణంగా ఆలస్యమైంది. సాగులో ఉన్న భూముల గుర్తింపుకు చేపట్టిన ఈ సర్వే ఇటీవల పూర్తవ్వగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు జరగడం లేదని వెల్లడైంది. ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా అర్హులైన రైతులకు మాత్రం ఫిబ్రవరి చివరికల్లా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా జమ చేయనున్నారు. ఇలా పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు దాదాపు ఒకేసారి రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉండటంతో ఈ నెల రైతులకు ‘డబుల్ బొనాంజా’గా మారనుంది. కేంద్రం నుంచి రూ.2 వేలు రాష్ట్రం నుంచి ఎకరానికి రూ.6 వేలు అందడంతో రైతులకు కొంత ఊరట కలగనుంది. పెట్టుబడి భారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు సాగుకు మళ్లీ ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ఫిబ్రవరి చివరి వారంలో నిజంగానే ఈ నిధులు ఖాతాల్లో పడతాయా? అన్నదానిపైనే.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి