Crime News : సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. వావి వరసలు లేకుండా.. మనుషులు మృగాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను చంపేసే పిల్లలు… అక్రమ సంబంధాల విషయంలో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్న వ్యక్తులు ఇలా చాలామంది ఎక్కువైపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తల్లిదండ్రులను వదిలి తన జీవితమే భర్తతో అని కాపురానికి వచ్చిన భార్యని…ఓ భర్త స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడటం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక వసంత్ పూర్ నివాసి అయిన మహిళ అతడిని మ్యాట్రిమోనీలో చూసి.. కొన్నాళ్లు మాట్లాడి పరిచయం ఏర్పరచుకుని ఆ తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించుకుని 2019లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దంపతులు హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో నివసిస్తున్నారు. పెళ్లి చేసుకున్న ప్రారంభంలో బాగానే ఉన్న భర్త ఆ తర్వాత అతనిలో మార్పులు రావడం జరిగింది. స్నేహితులతో కలిసి గంజాయి మరియు డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత భార్యని అత్యంత కిరాతకంగా హింసించేవాడు.
అంత మాత్రమే కాదు స్నేహితులతో కలిసి పడుకోవాలని చిత్రవాద చేసి కొట్టేవాడు. ఒక్కోసారి సిగరెట్లతో కాల్చేవాడు. ఇక ఇదే సమయంలో డ్రగ్స్ తీసుకున్న స్నేహితులు భర్త ఎదురుగానే ఆమెను లైంగికంగా వేధించేవారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి భర్త అత్యాచారానికి పాల్పడుతుండగా ఒక్కసారిగా తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసు తర్వాత ఆమెపై వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయి. కేసు విత్ డ్రా చేసుకోవాలని.. నిత్యం వేధించేవారు. దీంతో బాధిత మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.