
A husband who marries his wife with the person she loves
ప్రపంచంలోనే భారతీయ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థ చాలా బలమైంది. మనదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. అందువల్లే ఇతర దేశాలకు చెందిన వాళ్ళు చాలామంది భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గౌరవమిస్తారు. అటువంటి సాంప్రదాయబద్ధమైన మనదేశంలో ప్రస్తుతం పెళ్లి అనే వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుంటున్న చాలా జంటలు… కలసి జీవించలేక విడిపోతున్న కేసులు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న లేదా పెద్దలు చేసిన వివాహమైనా…
జీవితాంతం కలిసి బతకాల్సిన జంటలు.. చిన్నచిన్న గొడవలకు విడిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న భార్య వేరొక అబ్బాయితో ప్రేమలో ఉందని తెలుసుకున్న భర్త… ఆమెకు తానే పెళ్లి పెద్దగా మారి… ప్రేమించిన ప్రియుడుతో గుడిలో సాంప్రదాయ బద్ధంగా వివాహం జరిపించాడు. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం వారి పక్కింటి వ్యక్తితో భార్య సెల్ ఫోన్ లో మాట్లాడటం చూశాడు భర్త దినేష్.
A husband who marries his wife with the person she loves
దీంతో ఆమె బాధను పూర్తిగా అర్థం చేసుకొని పెళ్లి పెద్దగా మారి వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. దినేష్… గులాబీ అనే యువతీతో వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిరిచిన వివాహం. అయితే దినేష్ తో పెళ్లి కాకముందే గులాబీకి తన పక్కింటి అబ్బాయి తో ఎప్పటినుంచో ప్రేమలో ఉంది. విషయం పెళ్లి తర్వాత తెలుసుకున్న దినేష్ ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి ఆ తర్వాత గ్రామంలో పంచాయతీ పెట్టించి పెళ్లికొప్పించాడు. అంతేకాదు స్థానికంగా దేవాలయంలో వారిద్దరి పెళ్లి జరిగేలా తానే పెద్దగా మారి.. కట్టుకున్న భార్యకి విడుదల కలిగేలా చేశాడు. దీంతో దినేష్ చేసిన పనిని చాలామంది పెద్దలు మరియు గ్రామస్తులు అభినందించారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.