ChandraBabu : చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నాడు.. ఈ డ్రామా అంతా ఆయనే ఆడిస్తున్నాడు

Authored By Himanshi | The Telugu News | Published on: March 3, 2022, 7:00 am

ChandraBabu : సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకా హత్య ను రాజకీయం చేసి లబ్ది పొందేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినా సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేందుకు పావులు కలుపుతున్నాడు అంటూ ఆరోపించారు.పాపం సునీత కూడా చంద్రబాబు చేతిలో పావుగా మారారని సజ్జల అన్నారు.

వివేకా హత్య కేసులో రోజుకో ఆరోపణ చేస్తూ మీడియా లో రకరకాల ప్రచారాలు కల్పిస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఇది అంటూ సజ్జల ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని వైకాపా ను దెబ్బ తీసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేసి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుంది.. ఆయన ఆడిస్తున్న డ్రామా ఇది అని ప్రతి ఒక్కరికి తెలుసు.వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి పై కుట్ర పూరితంగా కొందరు చేస్తున్న అసత్య ప్రచారం పై సజ్జల మండిపడ్డాడు. వచ్చే ఎన్నికల్లో సునీతకు తెలుగు దేశం పార్టీ సీటు ఇచ్చే అవకాశం ఉంది.

Sajjala fire on tdp chief ChandraBabu Naidu about viveka murder case

Sajjala fire on tdp chief ChandraBabu Naidu about viveka murder case

ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీటు విషయమై సునీతకు హామీ ఇచ్చాడని.. వచ్చే ఎన్నికలలో ఆమె తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేస్తుందంటూ సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆమె తెలుగు దేశం పార్టీ కి వెళ్ళాలి అనుకుంటే వెళ్లొచ్చు, కానీ వైకాపా పై విమర్శలు చేయాలనుకోవడం మాత్రం తప్పు అంటూ సజ్జల హితవు పలికాడు. రాజకీయంగా వివేకా హత్య కేసు ని వినియోగించుకునేందుకు గత మూడు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి అయినా కూడా ఇప్పుడు సునీతను పావుగా వాడుతూ వైకాపాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ సజ్జల ఆరోపించాడు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp