sajjala ramakrishna reddy ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వైఎస్ జగన్ రెండో దఫా చేపట్టబోయే విస్తరణను అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇదే కేబినెట్‌తో అధికార వైసీపీ 2024 ఎన్నికలను ఎదుర్కోనుందని, దీనితో అటు పరిపాలన, ఇటు రాజకీయంగా ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో సమర్థులైన వారికి మాత్రమే రెండో విడత మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది వైఎస్ జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం పార్టీవర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉంటున్నారు. కేబినెట్ ర్యాంక్‌తో కొనసాగుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల కేబినెట్ కావడం వల్ల సజ్జల రామకృష్ణా రెడ్డికి కీలక పోర్ట్‌ఫోలియోను అప్పగిస్తారని తెలుస్తోంది. రాజకీయ పరమైన దాడులను తిప్పి కొట్టడానికి.. ఎదురుదాడి చేయడానికీ సజ్జల సేవలను వినియోగించుకుంటారని సమాచారం.
ప్రస్తుతం సలహాదారు హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి కొన్ని రాజకీయ పరమైన విమర్శలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. రాజ్యాంగేతర శక్తిగా సజ్జల రామకృష్ణా రెడ్డిని అభివర్ణిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీకే చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సైతం సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని పలుమార్లు విమర్శలను సంధించిన విషయం తెలిసిందే. కేబినెట్‌లోకి సజ్జల రామకృష్ణా రెడ్డిని తీసుకోవడం ద్వారా అలాంటి విమర్శలకు చెక్ పెట్టినట్టవుతుందనీ అంటున్నారు. వైఎస్ కుటుంబానికి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆత్మీయుడు. అత్యంత దగ్గరివాడు. ఆయన స్వస్థలం కూడా పులివెందులే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్ జగన్ నెలకొల్పిన వైసీపీలో చేరి, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణా రెడ్డి సేవలను వైఎస్ జగన్ వినియోగించుకుంటున్నారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు.
సజ్జల రామకృష్ణారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాల్సి వస్తే రాజకీయ, స్థానిక, సామాజిక వర్గ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాకే చెందిన నేత కావడం వల్ల మలిదశ కేబినెట్ విస్తరణలో ఆ జిల్లాకు చెందిన మరొకరికి చోటు దక్కకపోవచ్చు. అదే సమయంలో వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడం మరో మైనస్ పాయింట్‌గా మారుతుందనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే సజ్జల రామకృష్ణా రెడ్డి సేవలు పార్టీకీ, ప్రభుత్వానికి అవసరమైనందువల్ల వైఎస్ జగన్ తన విచక్షణాధికారాలతో బెర్త్ కల్పిస్తారని చెబుతున్నారు. వైఎస్ జగన్‌ను మినహాయిస్తే ప్రస్తుతం కడప జిల్లాకు మంత్రివర్గంలో దక్కింది ఒక కేబినెట్ మాత్రమే.
కడప శాసన సభ్యుడు అమ్జాద్ భాషా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రెండోదశ విస్తరణ సందర్భంగా రాయచోటి శాసన సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మంత్రివర్గ పదవిని ఆశిస్తున్నారని అంటున్నారు. వారిద్దరూ మొదటి నుంచీ పార్టిలో ఉంటోన్న వారే. సజ్జల రామకృష్ణారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటే, రెడ్డి సామాజిక వర్గం కోటా భర్తీ అవుతుందని, మరొకరికి ఛాన్స్ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.