Salaar Movie : పాన్ ఇండియా హీరో Prabhas ప్రభాస్ మరి కొన్ని గంటల్లోనే Salaar Movie Review సలార్ సినిమా రివ్యూ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 22న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ అంచనాల మధ్య విడుదలవుతుంది. ప్రభాస్ అభిమానులు టికెట్ల కోసం ఇప్పటికే పడి కాపులు కాస్తున్నారు. ఇప్పటివరకు కొన్నిచోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్ది ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ బాగా నిరాశపరిచాయి. అందులో ప్రభాస్ మార్క్ ఎలివేషన్స్ కూడా బాగా మిస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కేజిఎఫ్ సిరీస్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించిన డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వం వహించిన సలార్ పై అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
ఈ సినిమా మొదటి భాగంగా ‘ సలార్ పార్ట్ వన్ : సీజ్ ఫైర్ ‘ పేరుతో రేపు విడుదల కాబోతుందిష అయితే సలార్ సినిమా ‘ ఉగ్రం ‘ కి రీమేక్ అని చర్చ కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సలార్ సినిమా కేజిఎఫ్ రేంజ్ లో ఉంటుందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని సినిమా యూనిట్ ని డైరెక్ట్ గా అడిగితే కేజిఎఫ్ రేంజ్ సక్సెస్ దృష్టిలో పెట్టుకొని సలార్ థియేటర్లకు రాకూడదు అని అంటున్నారు. కేజిఎఫ్ లో యాక్షన్ బాగా పండింది. డ్రామా తక్కువగా ఉంటుంది. కానీ సలార్ సినిమాలో డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే సలార్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకోకుండా వెళితే సలార్ డిసప్పాయింట్ చేయదు అని అంటున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈరోజు సలార్ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులు స్పెషల్ షో చూడడం జరిగింది. రెండు ట్రైలర్లు చూస్తే కథ ఏమిటి అన్నది అందరికీ ఒక ఐడియా వచ్చింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడు కోసం ఫైట్ చేయడానికి హీరో వస్తాడు. ఆ హీరో కలను నెరవేర్చిన తర్వాత అతనితో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది సలార్ కథ. అయితే మొదటి పార్ట్ లో స్నేహితుడి కోసం హీరో చేసిన పోరాటాన్ని చూపించబోతున్నారు అని అంటున్నారు. సెకండ్ పార్ట్ లో వారి మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని చూపిస్తారని, ఇక సలార్ పార్ట్ వన్ చూసిన కొందరు సినీ ప్రముఖులు ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉంటుందని, ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటాయని అన్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.