Home » Entertainment » Samantha Raj Marriage News Viral
Entertainment

Samantha-Raj | సమంత- రాజ్ నిడుమోరు మధ్య పెరుగుతున్న బాండింగ్.. త్వ‌ర‌లోనే పెళ్లి

Authored By
Sam C
The Telugu News | Published on: September 3, 2025, 1:00 pm
Advertisement

Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మ‌రింత స్ట్రాంగ్ అవుతుందంటూ గ‌త కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో దర్శకుడిగా పని చేసిన రాజ్‌తో సమంతకు అప్పుడే పరిచయం మొదలై, ఆ సాన్నిహిత్యం ఇప్పుడు ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా ఊహిస్తోంది.

Advertisement

#image_title

ఎంత‌వ‌ర‌కు వాస్త‌వం..

Advertisement

ఇటీవల సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు కూడా రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించడం, వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడినట్లు సూచిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ల సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమకు బీజం పడిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవ‌ల సమంత షేర్ చేసిన ఓ ఫోటోలో, రాజ్ భుజంపై తల వాలిన విధానం, వీరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా మారింది.

ముంబైలో వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడంతో పాటు, సమంత ఇటీవల షేర్ చేసిన ఓ వీడియోలో ఆమె ఒక వ్యక్తి చేయి పట్టుకుని ఉండటం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో ఉన్న చేతిని పరిశీలించిన ఫ్యాన్స్, ఆ బ్రాస్‌లెట్‌ను బట్టి అది రాజ్ నిడుమోరుది అని గుర్తించారు. ఇదే బ్రాస్‌లెట్ ఆయన గతంలో ధరించిన ఫోటోల్లో కూడా కనిపించడం గమనార్హం.ఈ అభిప్రాయాలన్నింటిని బట్టి, నెటిజన్లు “డేటింగ్ కన్ఫర్మ్ అయింది” అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. “పెళ్లి ఎప్పుడంటూ?” ప్రశ్నలు సంధించడమే కాదు, కొందరు వీరిద్దరికీ “కంగ్రాట్స్” చెబుతున్నారు కూడా.

Advertisement

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి