Samsung 4K Neo TV : సౌత్ కొరియన్ దిగ్గజం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సామ్ సంగ్ పరికరాలకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే సామ్ సంగ్ ప్రస్తుతం సరికొత్త ఫీచర్స్ తో 4కే స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సామ్ సంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీని గత సోమవారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అందుబాటు ధరలో 43 ఇంచెస్ తో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అలాగే అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు ఇది సపోర్ట్ చేయనుంది. అయితే ఓఎల్ఈడీ ప్యానెల్‌కు బదులుగా సాధారణ లెడ్ ని మాత్రమే అందిస్తోంది. ఈ టీవీ 3840×2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో 50 ఎచ్ జడ్, ఎచ్ డీఆర్10+, వన్ బిలియన్ ట్రూ కలర్స్ టెక్నాలజీ రిఫ్రెష్ రేట్‌తో ప్యానెల్‌ను సామ్ సంగ్ అందిస్తోంది.
టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే ఈ టీవీలో 1.5 ర్యామ్, 16 జీడీ ఇంటర్నల్ స్టోరేజ్ అవైలేబుల్ లో ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ద్వారా ట్యూన్ 20 వాట్ల స్పీకర్‌లతో ఈ టీవీ సౌండ్ సిస్టమ్ అద్భుతంగా ఉంది. స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్ టీవీ సౌండ్‌ని కంటెంట్‌కు అనుగుణంగా అడ్జెస్ట్ చేస్తుంది. దీంతో వాల్యూమ్‌ను మాన్యువల్‌గా అడ్జెస్ట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సౌండ్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే.. టీవీ స్పీకర్లు, సౌండ్‌బార్ నుంచి సౌండ్‌ని సింక్రొనైజ్ చేసే క్యూ-సింఫనీ ఫీచర్ కూడా ఉంది.
టీవీలో మ్యూజిక్ ప్లేయర్ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. కానీ మీరు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో ఉంటే.. స్పోటీఫై, గానా వంటి అన్ని ప్రధాన యాప్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యాప్ టీవీ, జీ5, డిస్నీ+ హాట్ స్టార్, వూట్ ఏఎల్ టీ, ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. పీసీ మోడ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది. ఈ టీవీ ధర ప్రస్తుతం రూ.35,990 గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో పాటు సామ్ సంగ్ అధికారిక వెబ్ సైట్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.